
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ చేస్తున్న రాజకీయం చూస్తుంటే ఆటలో అరటిపండు మాదిరే కనిపిస్తుంది. ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ ఒక నిర్దిష్టమైన రాజకియ విధానాలు లేకుండా, కనీసం పార్టీ క్యాడర్ కి లీడర్లకు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు లేకుండా తెరముందు ఒకరితో తెరచాటున మరొకరితో స్నేహ బంధాలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తుంది.
ఏపీలో టీడీపీ, జనసేన కూటమి లో భాగమైన బీజేపీ కూటమి ప్రత్యర్థిగా ఉండే వైసీపీ ని విమర్శించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ కూటమి పార్టీల మద్దతుదారులకు అయోమయాన్ని సృష్టిస్తుంది. అలాగే వైసీపీ కి సంబంధినచిన నేతల కేసుల పరిష్కారంలో సైతం బీజేపీ సీతకన్నేస్తూ సాగదీసే ధోరణిలో ముందుకెళ్తుంది.
అలాగే ఇటు తెలంగాణలో అధికార కాంగ్రెస్ కి ప్రతిపక్ష బిఆర్ఎస్ కి సమ దూరం అంటూనే పరోక్షంగా బిఆర్ఎస్ కి మేలు చేస్తుంది అనే భావనను తెలంగాణ ప్రజలకు కలిగిస్తుంది. దానితగ్గట్టే బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై బీజేపీ నుంచి బలమైన స్పందన కనిపించదు.
ఏపీలో టీడీపీ పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీ కి రాజకీయ శత్రువులైన వైసీపీ తోనూ బిఆర్ఎస్ తోనూ తెరచాటు స్నేహబంధాలు కొనసాగిస్తూ అందరి పార్టీ శ్రేణుల నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది. ఇలా బీజేపీ అనుసరిస్తున్న రెండు నాలుకల రాజకీయం బీజేపీ ని రెండు రాష్ట్ర రాజకీయాలలో ఆటలో అరటిపండు మాదిరి మార్చేశాయి.
Rohith is one of the strong players in the Bigg Boss TV show so far…
One of the biggest disasters in the history of Indian cinema was Indian 2. This…