
అంటే ఇంతకాలం తమకు మోడీ ప్రభుత్వం అండగా ఉండేదని కానీ ఇప్పుడు లేదని జగన్ చెపుతున్నారని మీడియాలో కొందరు విశ్లేషించారు. అలాగే టిడిపి ట్రాపులో బిజెపి పడిందనే వైసీపీ వాదనలపై కూడా విశ్లేషణలు వచ్చాయి.
ఈ ‘బిజెపి అండ’పై జరుగుతున్న విశ్లేషణ పోటీలలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా పాల్గొంటూ, “మేము ఏనాడైనా వైసీపీకి అండగా నిలబడ్డామా? ఇప్పుడు నిలబడలేదని చెప్పడానికి? ఏపీలో మేము అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తుంటే, మాకు వైసీపీకీ ఏదో అక్రమ సంబంధం ఉందన్నట్లు సిఎం జగన్ మాట్లాడటం, మరో కొత్త డ్రామాయే!
ఏనాడైనా మేము మీ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నామా? లేదా మీతో కలిసి పనిచేశామా? లేదు కదా?మరి మేమెందుకు మీ వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడాలి?మేము మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉన్నాము కదా?ఇప్పుడు అమిత్ షా వచ్చి అవే విమర్శలు చేస్తే, టిడిపి కోవర్టులు వ్రాసిన స్క్రిప్ట్ చదివారని, టిడిపి ట్రాప్లో బిజెపి పడిపోయిందని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
దేశమంతటా వ్యాపించిన జాతీయపార్టీ మాది. అటువంటి పార్టీని ఎవరో నలుగురు హైజాక్ చేయగలరని వైసీపీ ఎలా అనగలుగుతోంది? కేంద్ర ప్రభుత్వానికి ఎవరినీ వెనకేసుకు రావలసిన అవసరం లేదు. కానీ బిజెపి-వైసీపీల మద్య ఏదో రహస్య అవగాహన ఉందని అందుకే వైసీపీని కాపాడుతున్నామనే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి అమిత్ షాతో సమావేశం అవడానికీ, వైసీపీ ప్రభుత్వం గురించి అమిత్ అమిత్ షా చేసిన విమర్శలకు ఎటువంటి సంబందమూ లేదు. రాష్ట్రంలో బిజెపి బలపడకుండా అడ్డుకోవాలనే దురాలోచనతోనే వైసీపీ నేతలు ఈ డ్రామా రాజకీయాలు మొదలుపెట్టారు. కనుక ఇకనైనా ఈ డ్రామా రాజకీయాలు మానుకొంటే మీకే మంచిది,” అని అన్నారు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…