
ఏపీతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి బాగానే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే అనేక సంక్షేమ పధకాలను కూడా అమలుచేస్తోంది. కనుక కేసీఆర్కు తెలంగాణలో మంచి ప్రజాధారణ ఉంది. తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్ని ఓడించి అధికారంలోకి రాగలమని కేంద్రమంత్రి భగవంత్ కుబా నమ్మకంగా చెప్పుకొంటున్నారు. కానీ అప్పులు, కేసుల కోసం తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించగలమని అంతే నమ్మకంగా చెప్పలేకపోతున్నారు!
ఏపీ పరిస్థితి, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు రెండూ బాగోలేదని చెపుతున్న కేంద్రమంత్రి, ఇటువంటి పరిస్థితులలో కూడా ఏపీలో బిజెపి గెలిచి అధికారంలోకి రాగలదని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు?బిజెపిలో ఈ అయోమయం, అలసత్వం కారణంగానే ఏపీలో వైసీపీ ఇంత ధీమాగా ఉందని భావించవచ్చు. ఒకవేళ ఏపీలో కూడా బిజెపి బలంగా ఉండి ఉంటే, నేడు వైసీపీ తీరు మరోలా ఉండేది కదా?
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…