Telugu

నిజమే! ఆదినారాయణ రెడ్డికి అది చిన్న విషయమే కానీ..

వైసీపీ కడప కంచుకోటపై కూటమి జెండా ఎగురవేసినందుకు సంతోషించాల్సిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రెస్‌మీట్‌లు పెట్టి రాజీనామా చేస్తానంటూ హెచ్చరిస్తుండటం సీఎం చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది.

తన సోదరుని కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డికి జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. కానీ ఆ పదవిని టీడీపీకి చెందిన పుత్తా నరసింహారెడ్డికి కేటాయించడంతో ఆయన తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు.

ADVERTISEMENT

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు. కనుక నా పదవికి రాజీనామా చేసేందుకు వెనకాడను. నేనేమీ మంత్రి పదవి అడగలేదు కదా?జడ్పీ చైర్మన్‌ పదవి రాజేష్ రెడ్డికి ఇస్తానని హామీ ఇచ్చి అకస్మాత్తుగా వేరే వారికి ఇవ్వడం ఏమిటి?

ఇప్పటికే మా పార్టీ పెద్దలతో ఒకసారి అన్ని విషయాలు మాట్లాడాను. నా నిర్ణయం చెప్పాను. ఈరోజు రాత్రి మరోసారి సమావేశమైన తర్వాత వారు చెప్పిన దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. మా అధిష్టానంతో నాకు అండగా ఉంది. కనుక రాజకీయంగా మార్పులు చేసుకోవడం నాకు పెద్ద కష్టం కాదు.

ఒకవేళ మాకు ఈ పదవి లభించకపోతే నాతో పాటు జడ్పీటీసీలుగా ఎన్నికైన నా సోదరుడి ఇద్దరు కుమారులు కూడా రాజీనామా చేస్తాం. ఈ విషయంలో తగ్గేదేలే!” అని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో ఆయన నివాసానికి వెళ్ళి నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన ససేమిరా అన్నారు.

రాజకీయాలలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి విషయాలలో నేతల అహం తింటుంది. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పరిస్థితి కూడా అదే. కనుక అలాగే చేస్తున్నారు.

కానీ కూటమి ఐఖ్యతను కాపాడుకోవాల్సిన ఆదినారాయణ రెడ్డి వంటి సీనియర్ నేతలే కూటమిలో చిచ్చు పెట్టేందుకు ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులకు ఈవిధంగా అవకాశం కల్పించడం భావ్యమేనా?

ఆయనకు ఎమ్మెల్యే పదవి చిన్నదే కావచ్చు. కానీ ఈవిధంగా వ్యవహరిస్తూ ‘కడప విజయాన్ని’ అపహాస్యం చేసుకోవడం మంచిది కాదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే బదులు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడి సమస్యను పరిష్కరించుకొని ఉంటే చాలా హుందాగా ఉండేది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nara Lokesh’s ‘Secret Strategy’ Tweet: A Subtle Message to Tamil Nadu

Nara Lokesh's latest post on X may look like a joke, but it carries a…

27 minutes ago

Pics: Jesmin Roy Makes A Red Saree Look Effortlessly Hot

Jesmin Roy gives the classic red saree a playful, camera-ready twist in this breezy outdoor…

57 minutes ago