
[m9ad]
అది చూసిన నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తూ ఆటాడుకున్నారు. ఎమ్మెల్యేకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లో… ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం’ అని రాసుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసిన రామ్ కదమ్.. ఆ మెసేజ్లోని సమాచారాన్ని నిర్ధారించుకోకుండా యథాతథంగా ట్విట్టర్లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు.
“సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా” అని పేర్కొన్నారు. తాను మెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్టు సోనాలి బింద్రే జూలై 4న వెల్లడించడంతో హిందీ చిత్రపరిశ్రమ సహా అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో చికిత్స పొందుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంటోంది. కాగా, తాజా వివాదంపై రామ్ కదమ్ స్పందిస్తూ.. తాను క్షమాపణలు చెప్పానని, దీంతో ఈ వివాదం సమసిపోయిందని పేర్కొన్నారు.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…
Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…