తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ జపం…!

రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీల తమ రాజకీయ విమర్శలను బీజేపీ పార్టీ చుట్టే తిప్పుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ, రెండు బీజేపీకి బానిసలుగా మారారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల తన రాజకీయ విమర్శల అస్రాన్ని బీజేపీ పైకి ఎక్కిపెడుతుంది.

ADVERTISEMENT

అలాగే 2019 ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ తో జట్టుకట్టి బీజేపీ మిత్ర పక్షంగా ఉంటున్న జనసేన పై కూడా బీజేపీ కి మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల విషయంలో కానీ బీజేపీ పై ఒక్క మాట మాట్లాడకుండా బీజేపీకి జనసేన దాసోహం అయ్యింది అంటూ వైసీపీ బీజేపీ ని అడ్డుపెట్టుకుని జనసేన మీద విమర్శలు సందిస్తుంటది.

ఇలా అన్ని పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారి బీజేపీ ని అడ్డుపెట్టుకుని తమ ప్రత్యర్థుల మీద రాజకియ విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా బీజేపీ వైసీపీకి అనధికార మిత్ర పక్షం అనేది ఏపీలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరి నమ్మకం. ఈ నమ్మకానికి కూడా చాల బలమైన ఆధారాలు కనపడుతుంటాయి కూడా.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని బిల్లులకు పార్లమెంట్లో ఎటువంటి షరతులు లేకుండా వైసీపీ బేషరతు మద్దతు పలుకుతూ వచ్చింది. అలాగే జగన్ అక్రమ ఆస్తుల కేసు అడుగు ముందుకు వేయకుండా, జగన్ కోడి కత్తి కేసు విచారణకు రాకుండా, వివేకా హత్య కేసు కడప గడప దాటకుండా ఉండడానికి వైసీపీకి బీజేపీ ఆశీస్సులే కారణం అనే వాదన ఏపీ ప్రజలలో బలంగా నాటుకుపోయిది.

అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు వెనుక వైసీపీ కి మద్దతుగా, అదే కేసులో బాబుకు బెయిలు రావడం వెనుక బీజేపీ చక్రం తిప్పిందనే అభిప్రాయం కూడా ఏపీ ఓటర్లలో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే…, ఇక్కడ బీజేపీ తో రాజకీయం మరో విధంగా నడుస్తుంటది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కేటీఆర్ పదేపదే తెలంగాణ ప్రాజనీకానికి తెలియచేస్తున్నారు.

అలాగే కాంగ్రెస్ కు బీజేపీ సహకరిస్తుందని, బిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బీజేపీ – కాంగ్రెస్ రెండు ఏకమయయ్యాని బిఆర్ఎస్ నేతలు వాదిస్తుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి బిఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. బీజేపీ కూడా బీజేపీ ని రాష్ట్రంలో బలహీనపరచడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఏకమయ్యాయంటూ బీజేపీ నేతలు మరో వాదన తీసుకువస్తున్నారు.

అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది తెలంగాణ రాజకీయాలలో ప్రచారంలో ఉన్న వార్తే. అలాగే కవిత అరెస్టు అడ్డుపెట్టుకుని తెలంగాణలో బిఆర్ఎస్ బలాన్ని బీజేపీ ఆశిస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కవిత బెయిలు మీద బయటకు రావాలంటే బిఆర్ఎస్ ప్రస్తుత రాజకీయాల నుండి కాస్త లోపలికి వెళ్లాల్సిందే అని పట్టుపడుతుందని, దానికి కేసీఆర్ ఆమోదం కూడా జరిగిపోయిందనేది కాంగ్రెస్ వాదన.

ఇలా కాంగ్రెస్…బీజేపీ ఒక్కటే అంటూ బిఆర్ఎస్, బిఆర్ఎస్…బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్, కాంగ్రెస్…బిఆర్ఎస్ ఒక్కటే అంటూ బీజేపీ ఇలా భిన్న వాదనలతో వారు సందిగ్ధంలో ఉంటున్నారో లేక ప్రజలను కన్ఫ్యుజ్ చేస్తున్నారో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా బలం లేని బీజేపీ రాజకీయంగా బలంగా పని చేస్తుందనేది రుజువవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bharata Varsha’s Amma Kadhili Vacche: A Spiritual Touch

Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…

2 minutes ago

BCCI Spoiled Vaibhav’s Confidence? WC Winner Reveals

India's team management has come under backlash for constantly changing its opening combination in T20Is.…

34 minutes ago