
ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, “జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలని నిర్ణయించాము. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు కులగణన పేరుతో సర్వేలు చేయిస్తున్నాయి. కానీ వాటిని ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించకపోవడం వలన గందరగోళం ఏర్పడుతోంది. జనాభా, కుల గణన అనేది దేశ అవసరాలు, ప్రయోజనాల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదు. కనుక ఈసారి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టిన్నప్పుడే కులగణన కూడా చేస్తాము,” అని చెప్పారు.
దేశంలోనే మొట్ట మొదట కులగణన చేయించామనే పేరు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో హడావుడిగా సర్వే చేయించి విమర్శలపాలైంది. దాంతో మొదటిసారి పేర్లు నమోదు చేసుకోనివారి కోసం మళ్ళీ రెండోసారి కులగణన చేయాల్సి వచ్చింది.
అయినప్పటికీ తెలంగాణలో ప్రతిపక్ష బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు దానిని తప్పు పట్టాయి. కానీ దాని ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో రిజర్వేషన్స్ ఖరారు చేసి ప్రకటించడంతో నేటికీ బీసీలు గుర్రుగా ఊన్నారు.
వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆచరణ సాధ్యం కానివిదంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం ఢిల్లీకి పంపించారు. దాని కోసం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. దమ్ముంటే బిజీపీ పాలిత రాష్ట్రాలలో కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు.
అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించనప్పటికీ, హటాత్తుగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది.
కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి పట్ల శ్రద్ద, నిబద్దత ఉందని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకోబోతే, మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ హస్తంలో నుంచి ఆ అస్త్రాన్ని తీసేసుకుని షాక్ ఇచ్చింది.
అయితే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించబోతోందో కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్ కలిసి నిర్వహిస్తున్నయా?…
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…