
అటు రాజకీయాలలో, ఇటు సినీ రంగంలో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య ‘డాకు మహారాజ్’ రాజ్యం లేని రాజుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. NBK 109 గా నేడు టీజర్ రూపంలో వచ్చిన డాకు మహారాజ్ నందమూరి అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి.
అఖండ, భగవత్ కేసరి వంటి వరుస విజయాలను అందుకున్న బాలకృష్ణ ఈ సారి రాజ్యాలు, రాజులు అంటూ తన జోనర్ మార్చుకుని థియేటర్లలో రచ్చ లేపనున్నారా అన్నట్టుగా టీజర్ ఆకట్టుకుంది.
ఈ కథ విలువను పంచె దేవుళ్ళది కాదు, చీకటిని పంచె రాక్షసులది కాదు, రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది అంటూ వచ్చిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ సినిమా పై అంచనాలను పెంచేసింది. అలాగే విజువల్స్ పరంగా కూడా చాల రిచ్ లుక్ ఇచ్చింది.
బాలయ్య లుక్స్ విషయంలో కూడా దర్శకుడు బాబీ ప్రత్యేక శ్రద్ద చూపించినట్టు కనిపిస్తుంది. గుర్రం మీద ముఖానికి మాస్క్ కట్టుకుని బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తున్నారు. థమన్ అందించిన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మరోమారు గట్టి సౌండ్ చేసేలా కనిపిస్తుంది.
టాలీవుడ్ క్రెజి నిర్మాత నాగ వంశీ సితార బ్యానర్లో డాకు మహారాజ్ 2025 సంక్రాతి కానుకగా థియేటర్లకు రానుంది. అయితే బాలయ్యకు ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించనుండగా, హీరోహీన్స్ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ద శ్రీనాధ్ కనిపించనున్నారు. కీలక పాత్రలో కలర్ ఫోటో ఫ్రేమ్ చాందిని చౌదరి నటిస్తున్నట్టు సమాచారం.
1890 – 1955 మధ్య ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసిన ఓ బందిపోటు పేరు డాకు అని ఇది తమ స్టోరీకి సరిగ్గా సరిపోతున్నందున డాకు మహారాజ్ పేరును ఎంచుకోవడం జరిగిందంటూ దర్శకుడు బాబీ క్లారిటీ ఇచ్చారు.
అలాగే నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే అని సినిమాలో ఇంకా చాల ఉంది, ముఖ్యంగా ఇంటర్ వెల్ లో బాబీ డియోల్, బాలయ్య కాంబోలో వచ్చే సీన్ థియేటర్లలో రచ్చ లేపడం గ్యారెంటీ అంటూ నందమూరి అభిమానులకు సినిమా మీద హైప్ ను మరింత పెంచారు.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…