Telugu

‘హోమ్లీ & బ్యూటిఫుల్’ టు ‘హాట్ & బోల్డ్’

హోమ్లీ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ను సోషల్ మీడియా ప్రియులు ముద్దుగా ‘ఉప్మా’ అని పిలుచుకుంటుంటారు. ‘ప్రేమమ్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుపమ, “అ ఆ, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు”లతో కలిపి మొత్తం 8 సినిమాలలో నటించింది.

ADVERTISEMENT

ఈ సంక్రాంతికి 9వ సినిమాగా “రౌడీ బాయ్స్” పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ, గత ఎనిమిది సినిమాలలో చేయనిది ఈ సినిమాలో చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి. కొత్త హీరో ఆశిష్ తో కలిసి లిప్ లాక్ చేసిన సన్నివేశం నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఓ విధంగా చూస్తే “రౌడీ బాయ్స్” సినిమాకు ప్రస్తుతం ఇదే అతి పెద్ద ప్రమోషనల్ మెటీరియల్ గా మారింది.

సంప్రదాయ బద్ధమైన పాత్రలతో ఒక వర్గం వారినే ఆకట్టుకున్నానని అనుకుందో ఏమో గానీ, ఈ లిప్ లాక్ సీన్స్ తో యూత్ లో అనుపమకున్న క్రేజ్ మరింత రెట్టింపు అవుతోంది. సిల్వర్ స్క్రీన్ పై బ్యూటిఫుల్ హీరోయిన్ గానే కాకుండా, హాట్ అండ్ సిజ్లింగ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగమో లేక పాత్ర నచ్చితే బోల్డ్ సన్నివేశాలకైనా పచ్చ జెండా ఊపుతానని సంకేతమో గానీ, ఈ సరికొత్త మార్పుతో ఎన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ప్రేక్షకుల నుండి అంతంత మాత్రం ఆదరణే లభిస్తోంది. మౌత్ టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ‘రౌడీ బాయ్స్’ ఫలితం ఎలా ఉన్నా, అనుపమ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. నిఖిల్ సరసన “18 పేజీస్” మరియు “కార్తికేయ 2” సినిమాలు చేస్తుండగా, 2019 మలయాళ సూపర్ హిట్ మూవీ అయిన “హెలెన్” తెలుగు రీమేక్ లో నటిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

4 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

5 hours ago