
Bolisetti Srinivas on TDP-Jana Sena Unity
కూటమి ప్రభుత్వంలో జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు ఇటీవల మీడియాలో తరచుగా వినిపిస్తోంది. ముఖ్యంగా తన నియోజకవర్గంలో టీడీపి-జనసేనల మద్య జరుగుతున్న ‘కోల్డ్ వార్స్’ గురించి అయన చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెగలు రగిలిస్తున్నాయి.
తాజాగా తన నియోజకవర్గంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదంపై మళ్ళీ ఘాటుగా స్పందించారు. కానీ అయన ఆవేదన సహేతుకమే అని చెప్పక తప్పదు.
“నేను చనిపోవాలని కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారు. వారెవరో కూడా నాకు బాగా తెలుసు. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదు. తర్వాత మాట్లాడుతాను. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిపించాను. ఇంకా చాలా జరిపించాలి. కనుక నన్ను మరికొంత కాలం బ్రతకనివ్వండి,” అని విజ్ఞప్తి చేశారు.
ప్రోటోకాల్ వివాదాలపై మాట్లాడుతూ, “నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరైనా తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలి. కానీ కొందరు పట్టించుకోకుండా శిలా ఫలకాలు వేస్తున్నారు. ఇది సరికాదు,” అని అన్నారు.
కూటమి ఐక్యత గురించి మాట్లాడుతూ, “మూడు పార్టీలు ఒకే కుటుంబంలా కలిసి మెలిసి పనిచేయాలి. నేను అలాగే భావిస్తూ టీడీపి, బిజేపి శ్రేణులను కలుపుకొని పని చేస్తున్నాను. అవతలి వ్యక్తులు కూడా నాతో అలాగే కలిసి పనిచేయాలని కోరుకోవడం తప్పు కాదు.
స్థానిక సంస్థల ఎన్నికలలో మూడు పార్టీలకు ఇంత శాతం చొప్పున వాటాలు వేసి అభ్యర్ధులను నిలబెట్టడం వలన లాభముండదు. ఎక్కడ ఏ పార్టీ అభ్యర్ధి బలంగా ఉంటే వారినే నిలబెట్టాలి. వారికి మిగిలిన రెండు పార్టీలు కూడా పూర్తిగా సహకరించి గెలిపించుకోవాలి.
నా నియోజకవర్గంలో మాకు బలం ఉన్న చోట మా అభ్యర్ధులను, టీడీపి, బిజేపిలకు బలం ఉన్న చోట ఆ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టుకొని అందరినీ గెలిపించుకుందాం. కూటమి అభ్యర్ధులను గెలిపించుకునేందుకు నేను ఎంతైనా శ్రమిస్తాను. కానీ ఎవరికీ నష్టం కలిగించాలని కోరుకోను.
నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలు ఇదే స్పూర్తితో కలిసి పనిచేస్తే విజయం మనదే. కూటమిలో ఏ పార్టీకి చెందిన అభ్యర్ధి గెలిచినా అది కూటమి విజయమే కదా?” అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి నేతలు, కార్యకర్తలు అందరూ ఇలాంటి స్పూర్తితోనే పని చేశారు గనుకనే కూటమి అంత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఇది ఎన్నడూ మరిచిపోకూడదు. అత్యంత క్లిష్టమైన ఆ ఎన్నికలలోనే కలిసి పనిచేసి విజయం సాధించగలిగినప్పుడు, నుక స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అదే స్పూర్తితో కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించాలేరా?
స్థానికంగా మూడు పార్టీల నేతల మద్య ఏవైనా సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటిని తమ తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి అంతర్గతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. బహిరంగంగా ఒక్క తప్పు మాట మాట్లాడినా అది తమ ప్రత్యర్ధులకు ఆయుధం అందించినట్లవుతుందని గుర్తుంచుకోవాలి.
Telangana chief minister Revanth Reddy has been taken every public friendly approach since the start…
Megastar Chiranjeevi’s Kaaka has entered a crucial phase of its journey. The dubbing work for…