
హైద్రాబాద్ లోని అత్యంత ఖరీదైన సుమారు 9 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు, దొంగ జీవోలతో సొంతం చేసుకోవాలని చూసినందుకు గాను తెలంగాణ పోలీసులు తమిళనాడులో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ని అరెస్టు చేసారు.
అటు పిదప న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండ్ కు తీసుకున్నారు. అయితే తాజాగా బొల్లా కు తెలంగాణ న్యాయస్థానం బైలు మంజూరు చేసింది. బైలు మీద బయటకొచ్చిన బొల్లా వైసీపీ కి అలవాటైన ఆవు పాఠం కథను వన్నేవేస్తున్నారు.
తన అరెస్టు వెనుక ఏపీ ప్రభుత్వం హస్తముందని, ఏపీ నాయకుల ఒత్తిళ్లతోనే తెలంగాణలో తన పై భూ వివాదాలు సృష్టించారని, తనను అరెస్టు చేసారంటూ తన అరెస్టు క్రెడిట్ మొత్తం బాబు ఖాతాలో జమచేసేసారు బొల్లా. తనను రాజకీయంగా లొంగదీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ తన పై తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆరోపిస్తున్నారు బొల్లా.
అయితే అసలు బొల్లా మీద కేసులు నమోదు చేసింది తెలంగాణ పోలీసులు, అక్కడి ప్రభుత్వం, కానీ దాని తాలూకా నిందలు మాత్రం బొల్లా….బాబు, లోకేష్, నర్సారావు పేట ఎంపీ లావు పై మోపుతున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం బొల్లా పై అసత్య ప్రచారాలు చేసి తప్పుడు కేసులు బనాయించాలి అంటే తమ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకంటే సరిపోదా.?
అందుకోసం పక్క రాష్ట్ర పోలీసులను, పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని సాయం కోరుతుందా.? వైసీపీ నేతలు చేసున్న ఈ నిందారోపణలు అసలు సామాన్య ప్రజానీకం నమ్మే స్థాయిలోకి ఉన్నాయా.? వైసీపీ నేతల నేరాలు బయటపడినప్పుడల్లా, అందుకు వారు చట్టం ముందు నిలబడినప్పుడల్లా దానికి బాబే కారణం, దీని వెనుక టీడీపీ ఉంది అంటే ప్రజలు విశ్వసిస్తారా.?
వివేకా కేసులో న్యాయం కావాలి అంటున్న జగన్ సోదరి సునీత వెనుక బాబే, తనకు తన పిల్లలకు జగన్ అన్యాయం చేస్తున్నాడు అంటున్న జగన్ సొంత చెల్లి షర్మిల వెనుక బాబే, జగన్ తన కుమార్తె కు కుమార్తె బిడ్డలకు న్యాయం చెయ్యడం లేదని న్యాయస్థానాలను ఆశ్రయించిన జగన్ తల్లి విజయలక్ష్మి వెనుక బాబే,
చివరికి సాయి రెడ్డి వైసీపీ కి గుడ్ బై చెప్పడం వెనుక బాబే, బొల్లా తెలంగాణ ప్రభుత్వ భూముల కబ్జా కేసు వెనుక బాబే….ఇలా వైసీపీ బాబు బాబు అంటూ బాబు పేరు ముందుపెట్టి వెనుక చేస్తున్న రాజకీయానికి ఎప్పుడో కాలం చెల్లిందని వైసీపీ ఇప్పటికి గ్రహించలేకపోతుందా.?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…