
చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారని నిత్యం విమర్శలు చేసే వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి, గులక రాయి దాడిని హత్యాయత్నంగా చిత్రీకరించి టిడిపి సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్ధి బోండా ఉమాని ఈ కేసులో ఇరికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
గత ఎన్నికలలో కోడికత్తి డ్రామాతో వైసీపి ఏవిదంగా లబ్ధి పొందిందో కళ్ళారా చూసిన తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలలో జగన్ మీద దాడి చేయించాలని బుద్దున్నవారు ఎవరూ అనుకోరు. ఈ రాయి దాడి ఘటనను జగన్, వైసీపి ఏవిదంగా తమకు అనుకూలంగా మలుచుకొని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లెదుటే కనిపిస్తోంది కూడా.
కనుక ఇటువంటి చవుకబారు ఆలోచనలు చేసి ఎన్నికలలో బొండా ఉమా, టిడిపి విజయావకాశాలను దెబ్బ తీసుకుంటారనుకోవడం రాజకీయ అజ్ఞానమే.
శుక్రవారం ఉదయం విజయవాడలోని మొగల్రాజపురంలోని బొండా ఉమా నివాసం వద్దకు ఒకరొకరుగా పోలీసులు చేరుకొంటుండటంతో ఆయనకు అనుమానం కలిగి వెంటనే అజిత్ సింగ్ నగర్లోని టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడ టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు సిద్దంగా ఉన్నారు. దీంతో వారు తనని అరెస్ట్ చేసేందుకే వచ్చారని గ్రహించిన బొండా ఉమా వెనక్కు వెళ్ళిపోయారు.
ఈ ఘటనలో మొదట చంద్రబాబునాయుడే జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర చేయించారన్నట్లు వైసీపి దుష్ప్రచారం చేసింది. కానీ ఇదివరకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి టిడిపిని కోలుకోలేని దెబ్బ తీయవచ్చని భావించగా, అందరూ ఆయనకే సంఘీభావం ప్రకటించారు.
ఈ కారణంగానే ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగి అది టిడిపికి కలిసిరాగా ఇదే కారణంగా వైసీపి పట్ల ప్రజలలో వ్యతిరేకత మరింత పెరిగింది. కనుక మళ్ళీ ఈ కేసులో చంద్రబాబు నాయుడుని ఇరికిస్తే తామే దెబ్బ తింటామని వైసీపి మేధావులు గ్రహించినట్లే ఉన్నారు.
కనీసం విజయవాడ సెంట్రల్ బరి నుంచి బొండా ఉమాని తప్పించగలిగితే వైసీపి అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస రావుని గెలిపించుకోవచ్చని భావించిన్నట్లున్నారు. నామినేషన్స్ గడువు మరో 5 రోజులలో ముగుస్తుంది. కనుక బొండా ఉమాని నామినేషన్ వేయక ముందే అరెస్ట్ చేసి కేసు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని టిడిపి నేతలు వాదిస్తున్నారు.
కానీ ఇది టిడిపి కుట్ర అని వాదిస్తూ వైసీపి చేస్తున్న ఈ కుట్రని తాము ఖచ్చితంగా అడ్డుకుంటామని, వైసీపి దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమే గెలిచి అధికారంలోకి రాబోతోందని బొండా ఉమా అన్నారు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…