Telugu

జగన్‌ కాదు.. బొత్స ఝాన్సీ వస్తున్నారట… విశాఖకు!

గత రెండేళ్ళుగా వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు విశాఖ రాజధాని అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు సిఎం జగన్‌ విశాఖ షిఫ్ట్ అయిపోతున్నారంటూ సంక్రాంతి, ఉగాది, అట్లతద్ది, దసరా, దీపావళి, క్రిస్మస్ అంటూ అనేక పండుగ ముహూర్తాలు ప్రకటించారు.

కొత్త సంవత్సరం వచ్చేసింది కానీ జగన్మోహన్‌ రెడ్డి మాత్రం విశాఖకు మకాం మార్చలేదు. కనుక విశాఖలో ఋషికొండని చెక్కేసి వందల కోట్లు ఖర్చుపెట్టి ఆయన కోసం నిర్మించిన విలాసవంతమైన భవనం ఖాళీగా పడుంది.

ADVERTISEMENT

జగన్‌ విశాఖ వస్తారనుకుంటే మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సి వస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఆమెను విశాఖ నుంచి లోక్‌సభ అభ్యర్ధిగా సిఎం జగన్‌ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్‌ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.

అక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓడించాలంటే ఎంవీవీ సత్యనారాయణ సరైన వ్యక్తి అని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి చాలా కాలంగా అగ్రవర్ణాల నేతలే ప్రతినిధ్యం వహిస్తున్నారు. కనుక ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని టిడిపి, జనసేనలు భావిస్తున్నాయి.

ఈ విషయం తెలియగానే జగన్మోహన్‌ రెడ్డి కూడా వ్యూహం మార్చి కాపు సామాజిక వర్గానికే చెందిన బొత్స ఝాన్సిని బరిలో దింపాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.

విలేఖరులు ఇదే విషయం గురించి మంత్రి బొత్సను ప్రశ్నించగా, “ఈ విషయం గురించి నాకు తెలీదు. మా అధిష్టానాన్ని అడిగి తెలుసుకొని సమాధానం చెపుతాను. అయినా ఇది అప్రస్తుతం,” అంటూ ‘అవును… కాదు…’ అని సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు.

ఈ సందర్భంగా వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, “సమన్వయకర్తల మార్పు వలన కొందరు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. వారితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాము. ఏ పార్టీ అయినా బయట నుంచి వంద మంది రావలనే కోరుకొంటుంది తప్ప తమ నేతలను వదులుకోవాలనుకోదు కదా? చంద్రబాబు నాయుడు ఎన్ని క్రేన్లు, జాకీలు వేసి పైకి లేపాలని ప్రయత్నించినా సాధ్యం కాదు,” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్లీజ్ నోట్ దీజ్ పాయింట్స్!

తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతుంది? ఆంధ్రా పాలకుల దోపిడీ పోతుంది. నీళ్ళు, నిధులు, నియమాకాలు జరుగుతాయి. ఇది సినిమాలలో హీరోలు…

14 minutes ago

The Jailer Formula: A Winning Model for Chiranjeevi?

Watching a big star deliver a memorable theatrical experience is something fans always look forward…

39 minutes ago