Telugu

ప్లీజ్ నోట్ దీజ్ పాయింట్స్!

తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతుంది? ఆంధ్రా పాలకుల దోపిడీ పోతుంది. నీళ్ళు, నిధులు, నియమాకాలు జరుగుతాయి. ఇది సినిమాలలో హీరోలు చెప్పే పంచ్ డైలాగ్‌లా తెలంగాణ ప్రజలను చాలా కాలం ఉర్రూతలూపింది. అయితే పదేళ్ళ కేసీఆర్‌ పాలన, మూడేళ్ళ రేవంత్ పాలన ముగిసేసరికి ఈ డైలాగ్ ఎక్కడా వినిపించడం లేదు.

నీళ్ళు, నిధులు, నియామకాలు జరగడం లేదని, లక్షల కోట్లు దోచుకున్నారనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడక మునుపు నియంతృత్వానికి ప్రతీకగా నిలిచే ‘గడీ’ల గురించి అప్పుడప్పుడు మాటలు వినపడుతుండేవి.

ADVERTISEMENT

కానీ పదేళ్ళ కేసీఆర్‌ పాలన ముగిసేసరికి ఎక్కడ చూసినా ‘ఫామ్‌హౌసులు’ కనిపిస్తున్నాయి. అవీ కనీసం 25 ఎకరాల నుంచి వెయ్యేకరాల విస్తీర్ణం కలిగినవి కావడం చూస్తే, వాటి ముందు గడీలు కూడా తీసికట్టే అనిపిస్తుంది.

తాజాగా కేటీఆర్‌ పెద్దపల్లి సభకు హెలికాఫ్టర్‌లో వెళ్ళి కాంగ్రెస్‌ ప్రభుత్వం, మంత్రులు సింగరేణిని ఏవిధంగా దోచుకుంటున్నారో పూస గుచ్చినట్లు చక్కగా వివరించారు.

అప్పుడు చెల్లి కవిత “మా అన్నయ్య జస్ట్ రూ.188 కోట్లు పెట్టి పయోనీర్ అనే పత్రిక కొన్న ధనవంతుడు హెలికాఫ్టర్‌లో వెళ్ళకపోతే నాలాగ కార్లో తిరుగుతారా?” అని ప్రశ్నించారు.

అయితే హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున మూడు స్టార్ హోటల్స్‌ కలిగి ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేని కేటీఆర్‌ను సొంత చెల్లే ఇలా 188 కోట్లని అవమానించడం న్యాయమా?

‘గరివిడి లక్ష్మి’లా కల్వకుంట్ల కవిత ఏదో చెప్తుంటే విని ఊరుకోవాలి కదా? కానీ మంత్రి శ్రీధర్ బాబు మధ్యలో దూరి “నాడు కేసీఆర్‌ హయాంలో బీఆర్ఎస్‌ పార్టీ సింగరేణిని ఏటిఎంలా వాడుకున్న విధంబెట్టిదనిన…” అంటూ ఆయన కూడా పక్క వాయిద్యం వాయించారు.

కోర్టులో న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు శ్రద్దగా వింటున్నారని తెలిసి ఉన్నప్పటికీ, మధ్యలో ఓసారి ‘ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మి లార్డ్’ అని న్యాయవాదులు గుర్తు చేస్తూనే ఉంటారు.

అలాగే తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఏమేమి జరిగాయో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల నేతలు ఇంత చక్కగా వివరిస్తూ ‘నోట్ దీజ్ పాయింట్స్’ అన్నప్పుడు తప్పకుండా నోట్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే, తెలంగాణ ఏర్పడితే ఏం జరిగిందనే చరిత్రకు వారే ప్రత్యక్ష సాక్షులు కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Jailer Formula: A Winning Model for Chiranjeevi?

Watching a big star deliver a memorable theatrical experience is something fans always look forward…

27 minutes ago

డీఎస్సీపై సీబీఐ విచారణ కావాలి.. కానీ ఈ కేసుల్లో వద్దా?

ఏపీ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్రంలో వైసీపీ చేసిన హడావుడి అందరూ…

45 minutes ago