
Botsa Satyanarayana Family in Vizianagaram Politics
రాజకీయాలలో వారసత్వాలు సర్వసాధారణమే. ఒకటో ఆరో అయితే పర్వాలేదు కానీ ‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తామంటేనే’ సమస్య. విజయనగరం వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అదే చేస్తున్నరిప్పుడు.
ఆయనకు ఆక్సిజన్ కంటే పదవి చాలా ముఖ్యం. కనుక ఆయన రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ఏదో ఓ పదవిలో కనపడుతూనే ఉంటారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, ఆయన ఇప్పుడు మంత్రి పదవిలో కనిపించేవారు. కానీ దురదృష్టం కొద్దీ ఓడిపోయి కాస్త గ్యాప్ వచ్చినా మళ్ళీ వెంటనే ఎమ్మెల్సీ పదవి సంపాదించుకో గలిగారు.
పనిలోపనిగా తన మేనల్లుడు చిన్న శ్రీనుకి విజయనగరం జడ్పీ చైర్మన్ పదవి సంపాదించిపెట్టారు. కానీ ఆయన రాజీనామా చేసి టీడీపీలో చేరి పోయేసరికి, బొత్స సత్యనారాయణ కాస్త దిగులు పడినా కళ్ళు తుడుచుకుని ‘అంతా మన మంచికే’ అనుకుంటూ, ఖాళీ అయిన ఆ పోస్టును తన కుమార్తె అనూష కోసం ‘రిజర్వ్’ చేసుకున్నారు.
ముందుగా ఆమె చేత జిల్లాలోని బొండపల్లి నుంచి వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్స్ వేయించారు. జడ్పీ సమావేశంలో అన్ని కుర్చీలలో మన ఇంట్లో వాళ్ళే సభ్యులుగా కూర్చుంటే.. ఆహా! ఆ ఆలోచనే అద్భుతం కదా?
కనుక సోదరుడు లక్ష్మణరావు కుమారుడు చైతన్య చేత పూసపాటిరేగ నుంచి నామినేషన్స్ వేయించారు. సోదరి వెంకటలక్ష్మిని గుర్ల నుంచి, కోడలు పూజితను గరివిడి నుంచి నామినేషన్స్ వేయించారు.
వారినందరినీ గెలిపించుకోవడం ఆయనకు పెద్ద కష్టం కాదు. కనుక బొత్స కుటుంబ సభ్యులు గెలిస్తే జిల్లాలో వైసీపీ గెలిచినట్లే!
ఇటీవలే టీడీపీలో చేరిన చిన్న శ్రీను కూడా తన కుమార్తె సిరి సహస్ర చేత తెర్లాం, కొత్తవలస జడ్పీస్థానాలకు నామినేషన్స్ వేయించారు. ఆయన పార్టీ మారినా బంధుత్వాలు ఎక్కడికీ పోవు.. అలాగే ఉంటాయి. కనుక విజయనగరంలో ఎవరు గెలిచినా బొత్స సత్యనారాయణ కుటుంబంలోనే మెజార్టీ పదవులు భద్రంగా ఉంటాయన్నమాట!
ఇటువంటప్పుడే అనిపిస్తుంది… సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఓ గంపెడు మంది పిల్లల్ని అప్పుడే కని ఉంటేనా..
The shooting of actor Sivakarthikeyan's Seyon directed by Sivakumar Murugesan and produced by Kamal Haasan's…
Vijay Deverakonda's films continue to grab attention, but turning that attention into box-office success has…