
సొంత మీడియా, సోషల్ మీడియాలో నిత్యం అధికార పార్టీ మీద బురద జల్లుతూ, ఫేక్ వీడియోలు, ఫోటోలు పెడుతూ దుష్ప్రచారం చేసే వైసీపీ ఇప్పుడు తన సోషల్ మీడియా అష్ట్రాన్ని టిటిడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై గురిపెట్టింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి కామాంధుడుకి టిటిడీ చైర్మన్ పదవా? అంటూ బాణాలు సందించడం మొదలుపెట్టింది.
దానిపై అయన వెంటనే స్పందిస్తూ, “గత ముప్పై ఏళ్ళగా మా రెండు కుటుంబాల మద్య సంబందాలున్నాయి. నేటికీ రాకపోకలు సాగుతూనే ఉంటాయి.
అదొక డీప్ ఫేక్ వీడియో. వ్యక్తిగతంగా నన్ను అప్రదిష్టపాలు జేసి, తద్వారా తిరుమల ప్రతిష్టకి భంగం కలిగించేందుకే ఇలాంటి వీడియో సృష్టించారు.
ఈ నకిలీ వీడియో తయారుచేసినవారెవరో నేను ఊహించగలను. ఇప్పటికే నేను దీని గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాను. వారు దర్యాప్తు జరిపి ఈ వీడియో తయారీ వెనుక ఎవరెవరున్నారో బయటపెడితే అందరికీ కటకటాలు తప్పదు,” అని హెచ్చరించారు.
ఒకవేళ ఇది నిజమైన వీడియో అయితే, దానిలో ఉన్నది ఆయనే అయితే దానికి ఆయన ఎలాగూ మూల్యం చెల్లించుకుంటారు. కాకపోతే ఆయన చెప్పినట్లు టిటిడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు వైసీపీ చేసిన మరో కుట్ర ఇదని రుజువవుతుంది. కనుక వారు మూల్యం చెల్లించక తప్పదు.
ఈ వీడియో అసలైనదా నకిలీదా? అని తెలుసుకోకుండానే భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని ప్రెస్‌మీట్‌లు పెట్టి ఆయనని ఏకేశారు. ఇంకా ఈ ఏకుడు కార్యక్రమం మరికొన్ని రోజులు కొనసాగుతుంది కూడా. అంటే వైసీపీ గురి ఇంకా తిరుమలపై… టిటిడీపైనే ఉందని ఈ వీడియోతో… వైసీపీ నేతల మాటలతో స్పష్టమవుతోంది కదా?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…