
తాజాగా అల్లు అరవింద్ గురించి బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. అల్లు అరవింద్ గారి చుట్టూ తెగ తిరిగాను, గీత ఆర్ట్స్ ఆఫీస్ కు ఎన్నో సార్లు వెళ్లాను, ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు, ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే… పవన్ కళ్యాణ్ పరిచయం మాత్రమేనని… ఒక విధమైన ఫీలింగ్ తో బ్రహ్మాజీ చెప్పడం విశేషం. ఒకసారి మాత్రం నా పోరు పడలేక మద్రాస్ లో ‘మెగా…స్టార్…’ చిరంజీవి గారి దగ్గరికి తీసుకువెళ్ళారంటూ బ్రహ్మాజీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూడాల్సిందే! చిరంజీవి గారు చూసి… ప్రయత్నిస్తూ ఉండు… చూద్దాం… నీ అదృష్టం ఎలా ఉందో… అంటూ తనను ప్రోత్సహించినట్లుగా తెలిపారు.
ఆ తర్వాత ‘గులాభి’ సినిమా విడుదలైన తర్వాత ఒక ఫంక్షన్ లో కౌగలించుకుని, నువ్వు సాధించావు అని ప్రశంసించారని గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. అయితే చిరంజీవిలో ఒక గొప్పతనం ఉందని… ‘సింధూరం’ సినిమా చేసిన తర్వాత గుణశేఖర్ ‘చూడాలని ఉంది’ సినిమాలో ఒక క్యారెక్టర్ అనుకుంటే… ‘సింధూరం’ సినిమాలో హీరోగా చేసాడు, వెంటనే ఈ చిన్న పాత్ర ఏమిటి అని అర్ధరాత్రి 12 గంటలకు గుణశేఖర్ ను నిద్రలేపి మరీ ప్రశ్నించారని, ఆ తర్వాత ప్రజెంటేషన్ చూసి ఓకే అన్నారని, ఇతరుల కెరీర్ గురించి చిరు అలా ఆలోచిస్తారని మెగా…స్టార్… గురించి చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.
Ram Charan and Sujeeth working together is once again being discussed in industry circles. Nothing…
Nani has never been shy about backing his films. But while watching his promotions for…