‘సమంత’ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న ‘ప్రిన్స్’ ఫ్యాన్స్!

brahmostavam poster for samantha birthday‘కుందనపు బొమ్మ’ సమంత పుట్టినరోజు నాడు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఓ రేంజ్ లో హంగామా చేసారు. తొలుత ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించి మోషన్ పిక్చర్ లో ప్రిన్స్ మహేష్ బాబు, ఓ ప్రత్యేకమైన బైక్ దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను నూతన ఉత్సాహంలో ముంచెత్తగా, సమంత పుట్టినరోజును పురస్కరించుకుని మహేష్ బాబు మరో పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. ఇలా సమంత పుట్టినరోజు ‘బ్రహ్మోత్సవం’ మయం కాగా, మరో కారణంతో కూడా సోషల్ మీడియాలో ప్రిన్స్ అభిమానులు సందడి చేసారు.

ADVERTISEMENT

“పోకిరి” విడుదలై నేటికి ఒక దశాబ్దం కావడంతో, 75 సంవత్సరాల సినీ చరిత్రను లిఖించిన ‘పోకిరి’ గుర్తులను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేసారు. కేవలం 9 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ‘పోకిరి,’ టాలీవుడ్ లో తొలి 40 కోట్ల షేర్ అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. నిజానికి ఈ సినిమా సాధించిన రికార్డులతోనే మళ్ళీ సినీ జనాలకు కలెక్షన్స్ గోల అలవాటయ్యింది. అయితే ‘పోకిరి’ చిత్రం ప్రిన్స్ ఫ్యాన్స్ కు ప్రత్యేకమైనది కావడంతో నేడు ఓ రేంజ్ లో హంగామా చేసారు.

ADVERTISEMENT
Latest Stories