Telugu

‘బ్రహ్మోత్సవం’ టీజర్ అప్ డేట్స్!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమా ఆడియో మే 1వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తిరుపతిలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ‘వెన్నెల’ కిషోర్ వంటి వారు ఈ సినిమాను భాగాలుగా చూసి ట్విట్టర్ లో చెప్పడంతో ‘బ్రహ్మోత్సవం’పై అంచనాలు ఏర్పడుతున్నాయి. వీటిని మరింత రెట్టింపు చేసేందుకు చిత్ర యూనిట్ వరుస టీజర్లతో ప్లాన్ చేస్తోందని సమాచారం. ట్రేడ్ వర్గాల లేటెస్ట్ న్యూస్ ప్రకారం మే 26వ తేదీన ఆడియో రిలీజ్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనుందని తెలుస్తోంది.

ADVERTISEMENT

అలాగే 22వ తేదీన ప్రచార చిత్రాలు కూడా విడుదల కానున్నాయని టాక్. అయితే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అభిమానులు రూపొందించిన పోస్టర్ వీక్షకులకు వీనుల విందుగా ఉండడంతో సోషల్ మీడియాలో ‘బ్రహ్మోత్సవం’ పోస్టర్ హంగామా చేస్తోంది. మే మాసంలో విడుదల కానున్న ఈ సినిమా కోసం రిలీజ్ డేట్ ను లాక్ చేయడానికి చిత్ర యూనిట్ కూడా తుది కసరత్తులు చేస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwambhara Takes Risky Decision: Another Backfire?

The decision to bring Hari Gowra on board for the background score of Chiranjeevi's Vishwambhara…

39 minutes ago

Sandeep Vanga Shuts Down Rumors: Salman Fans in Panic?

The makers of Spirit have responded to rumours about a possible delay or shutdown. Reports…

60 minutes ago