Telugu

ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రత్యేకత ఏమిటంటే ఆయన పార్టీకి, శాసనసభ సమావేశాలకు, రాజకీయాలకు దూరంగా ఏడాదిన్నర పాటు తన ఫామ్‌హౌస్‌లో పడుకున్నా అదీ చాలా గొప్ప విషయమే అని పార్టీ నేతల చేత ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తారు.

ఎప్పుడైనా పార్టీ కార్యాలయానికి, శాసనసభకు వచ్చినా అదీ మహాద్భుతమే అన్నట్లు హైప్ క్రియేట్ చేయించుకుంటారు.

ADVERTISEMENT

మరి అటువంటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు సాయంత్రం హనుమకొండ జిల్లాలో చాలా జరుగబోయే బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభకి, ఆ సభకి వస్తున్న తనకి హైప్ క్రియేట్ చేసుకోకుండా ఉంటారా?అంటే కాదని అందరికీ తెలుసు.

దేశంలో నభూతో నాభవిష్యత్ అన్నట్లు ఈ సభ జరుగబోతోందని బిఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

ఈ సభ కోసం ఖర్చుకి వెనకాడకూడదని కేసీఆర్‌ నిర్ణయించారు కనుక రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మందిని జనసమీకరణ చేసి వేలాది బస్సులు, వాహనాలలో సభకు తరలిస్తున్నారు.

మళ్ళీ చాలా కాలం తర్వాత, తెలంగాణ రాష్ట్రం అంతటా గులాబీ రంగు అలుముకుంది. ఎక్కడ చూసినా గులాబీ జండాలు, బ్యానర్లే. ఎక్కడ చూసినా కేసీఆర్‌, కేటీఆర్‌ బ్యానర్లు కటవుట్లే!1

ఈ గులాబీ హడావుడి ముందు కాంగ్రెస్‌ నేతల మాటలు, విమర్శలు అన్నీ గాలికి గడ్డిపోచ కొట్టుకుపోయిన్నట్లు కొట్టుకుపోతున్నాయి.

ఇప్పుడు తెలంగాణ అంతటా కేసీఆర్‌ పేరు మారుమ్రోగిపోతోంది. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలు, ఆమరణ నిరాహారదీక్ష, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, కేంద్రంతో సింగిల్ సింహంలా పోరాడిన తీరు గురించి పాటలు కట్టి ఊరూవాడా వినిపిస్తున్నారు. పనిలో పనిగా కేసీఆర్‌ ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రజలకు గట్టిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈరోజు సాయంత్రం సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారో అని కాంగ్రెస్‌, బీజేపి, తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ నేతలే చెపుతున్నారు. బహుశః ట్రంప్‌, పుతిన్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు.

ఓ పెద్ద హీరోతో వందల కోట్లు బడ్జెట్‌తో తీసిన సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుంటే చిత్ర బృందం దానిని ఏవిదంగా ప్రమోట్ చేస్తూ హైప్ పెంచుకుంటూపోతారో, అదేవిదంగా నేడు జరుగబోయే బిఆర్ఎస్ పార్టీ సభకి కేసీఆర్‌ వస్తున్నారంటూ రోజురోజుకీ, గంట గంటకీ అప్‌డేట్‌ ఇస్తూ ఆయనకు, తమ సభకి బిఆర్ఎస్ పార్టీ నేతలు చాలా బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఆయన తన ఫామ్‌హౌస్‌ నుంచి కారులోనో, హెలికాఫ్టర్‌లోనో బయలుదేరగానే, ఆయనేదో వేరే గ్రహం నుంచి వస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ చేసే హడావుడి అంతా ఇంత ఉండదు.

ఇంతకీ చెప్పేదేమిటంటే, ఏడాదిన్నరపాటు పార్టీని, శాసనసభ సమావేశాలకు, ప్రజలకు దూరంగా ఫామ్‌హౌస్‌లో బాధ్యతారాహిత్యంగా కాలక్షేపం చేసినందుకు, పార్టీ శ్రేణులకు, తనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు, తనకు నెలకు సుమారు రూ.2.50 లక్షల జీతాభత్యాలు చెల్లిస్తున్న ప్రభుత్వానికి కేసీఆర్‌ సంజాయిషీ, క్షమాపణలు చెప్పుకోవలసి ఉండగా, “నేను బయటకు రావడమే మహాద్భుతం. నా దర్శనం భాగ్యమే మీ అదృష్టం. నా నామ స్మరణతోనే అందరూ తరించండి… నా మాట కోసం.. నా కనుసైగ కోసం ఎదురుచూడండి.. నేను మాట్లాడే మాట కోసం యావత్ లోకమే ఎదురుచూస్తోంది..” అన్నట్లు హైప్ క్రియేట్ చేసుకోగలిగారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఇంత హైప్ క్రియేట్ చేసుకోలేకపోయింది. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ హడావుడితో రాష్ట్ర ప్రజల మూడ్ మారుతుందనే విషయమైనా గ్రహించారో లేదో?

ఈ రోజు సభలో కేసీఆర్‌ ఏం చెపుతారో గానీ, రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమని తాము ఎలా ప్రమోట్ చేసుకోవాలి?ఎన్ని తప్పులు చేసినా ప్రజల చేత జేజేలు ఎలా పలికించుకోవాలి? తమకు, పార్టీ హైప్ ఏవిదంగా క్రియేట్ చేసి పెంచుకోవాలి?తమ కోసం ప్రజలు, మీడియా చర్చించుకునేలా ఎలా చేయాలి? ఎదురుచూసేలా ఎలా చేయాలి?వంటి టెక్నిక్స్ అన్నీ బిఆర్ఎస్ పార్టీని, దాని అధినేత కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

25 minutes ago

Is Rashmika Too Busy For Ranabaali? Vijay Explains

Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…

26 minutes ago