పాటలు…డాన్సులతో సాగుతున్న రాజకీయ యాత్రలు

నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అధికార – విపక్షలు మధ్య విమర్శలు ప్రతివిమర్శల పర్వం నడిచింది. అయితే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజలకు అత్యంత చేరువ కావడానికి కేటీఆర్ కూడా వంటలక్క పాత్రలో ప్రవేశించక తప్పలేదు.

మొన్నీమధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ లో కోడికూరా వండుతూ తన పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లిన కేటీఆర్ కు మంచి స్పందనే ఎదురయ్యింది. ప్రత్యర్థుల పై విమర్శలు చేస్తూ తమ పార్టీ ప్రచారం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు తన మాటలతో ఆటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డి పెట్, సిరిసిల్ల ప్రాంతాలలో ప్రచారానికి వెళ్లిన కేటీఆర్ తమ పార్టీ ప్రచార గీతానికి తన డాన్సులతో అటు కార్యకర్తలను, పార్టీ అభిమానులను సభకు హాజరయిన ప్రజలను ఉర్రుతలూగించారు.

ADVERTISEMENT

తెలంగాణలో అధికార పార్టీ నేతలు తమ డాన్సులతో పార్టీ అభిమానులలో ఊపు తెప్పిస్తుంటే ఏపీలో తమ నాయకుడిని కొనియాడుతూ పాటలతో ముందుకెళ్తున్నారు ఇక్కడి అధికార పార్టీ నేతలు.సీఎం జగన్ పై మంత్రి సిదిరి అప్పలరాజు ఏకంగా ఓపాటనే రచించారు.అధికార పార్టీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సిదిరి గారు ‘జగనే నా నమ్మకం’ అంటూ ఓ పాట అందుకున్నారు.

రాబోయే ఎన్నికలలో ప్రజలను మెప్పించడానికి, తిరిగి అధికారం దక్కించుకోవడానికి తెలంగాణ అధికార పార్టీ నేతల విన్యాసాలు ఒకపక్క… వచ్చే ఎన్నికలలో అధిష్టానాన్ని మెప్పించి తిరిగి పార్టీ సీటు దక్కించుకునేందుకు అధినేత పై తమ పాటలతో భజనా కార్యక్రమాలు చేస్తూ తంటాలు పడుతున్న ఏపీ అధికార పార్టీ నేతలు మరో పక్క. ఇలా ఎవరికీ నచ్చిన పంధాలో వారు ప్రజలలోకి వెళుతున్నారు.

అయితే ఎన్నికల ముందు ఇలా ప్రజలలో మమేకమైపోయే రాజకీయ నాయకులు ఎన్నికల తరువాత మాత్రం పరదాలతో ఒకరు,తమ అనుచరులతో మరొకరు,భద్రతా కారణాలతో ఇంకొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్తూ ప్రజలను దగ్గరకు కూడా రానివ్వకపోవడం మాత్రం ప్రజలను విస్మయానికి గురిచేసే అంశం. ప్రజలు కూడా ఎన్నికల ముందు ప్రతి రాజకీయ నాయకుడికి ఇవే కారణాలు చెప్పి రాజకీయ పార్టీలను ఆయా పార్టీల నేతలను తమ దరిచేరనివ్వకపోతే అసలు రాజకీయాలు నడుస్తాయా? రాజకీయ నేతలు నాయకులుగా మారగలరా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Anukreethy Turns Casual Denim Into Pure Glam

Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…

18 minutes ago

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

48 minutes ago