
వైసీపీ నేతలు ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టేదాని పై పెట్టే శ్రద్ధలో కొంచమైనా ఎన్నికల అఫడవిట్ పై పెట్టి ఉంటే ఇప్పుడీ పరిస్థితిలో వచ్చి ఉండేది కాదని ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలకు బలం చేకూరేలా వైసీపీ నాయకుల ప్రవర్తనా శైలి కనపడుతుంది.
నేటి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల పై వ్యక్తిగత దాడులతో విరుచుకుపడుతున్న వైకాపా నేతలు ఇప్పుడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు, తప్పిదాలకు పాల్పడుతున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన అఫడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారని ఇప్పటికే టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసారు. అదలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వైసీపీ నేత నామినేషన్ పెండింగ్ లో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఎన్నికల అధికారికి సమర్పించిన తన అఫడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ డోన్ అధికారి బుగ్గన నామినేషన్ ను పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. అఫడవిట్ లో బుగ్గన తన ఆస్తుల వివరాలు పొందుపరచలేదనే కారణంతో అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తుంది. అలాగే పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ దాఖలు చేసిన అఫడవిట్ పై కూడా జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ అభ్యంతరం తెలిపారు.
అఫడవిట్ లో కూడా సరైన సమాచారం అందించకుండా మేనేజ్ చేసేందుకు అక్కడ ఉంది వైకాపా నాయకులు కాదని సదరు అభ్యర్థులు గ్రహించాలంటూ సలహాలిస్తున్నారు కూటమి నేతలు.
ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్ళుగా గ్రహణం పట్టిన చంద్రుడిలా చీకటిలో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు,…
Prabhas and postponements have an interesting history. On several occasions, his films moved away from…