Telugu

కందకు లేని దురద ‘కత్తి’కి ఎందుకు?

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ వేదికగా ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు తిరుగుతున్నాయి. పవన్ చేస్తోన్న ప్రతి ప్రకటనపై కత్తి మహేష్ కామెంట్ చేస్తుండడంతో మరోసారి బన్నీ వాసు తెరపైకి వచ్చి, కత్తికి కౌంటర్ ఇచ్చారు. ‘అల్లు అరవింద్ మీద పడి ఏడవడం తప్పు’ అంటూ కత్తి మహేష్ చేసిన కామెంట్ పై బన్నీ వాసు స్పందిస్తూ…

ADVERTISEMENT

‘అయ్య బాబోయ్… కుటుంబంలో పుల్లలు పెట్టే పనులు వద్దు, పవన్ ఏమన్నారో మాకు తెలుసు, ఉల్లికి లేని దురద కత్తికి ఎందుకు?” అంటూ విసుర్లు విసిరారు. మరోవైపు ఇదే తరహా సూచనలను పవన్ కళ్యాణ్ కూడా తన కార్యకర్తలకు అందించారు. ఎవరెవరో చేస్తున్న విమర్శలపై స్పందించి అనవసరంగా వారిని పెద్ద వారిని చేయకండి, నేను అసలు విమర్శలను పట్టించుకోను, నాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు? వదిలేయండి అంటూ ‘తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా తనను విమర్శించే వారిపై సెటైర్లు కూడా వేసారు పవన్. “తనను ద్వేషించే వ్యక్తులు వారి అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నట్టేనని, మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయని… ఒకరిని ద్వేషించే సమయంలో మాత్రం శరీరం మొత్తం ప్రభావితమవుతుందని… రక్తం పాడవుతుందని, ముఖంలోని కండరాలు పాడవుతాయని చెప్పారు. మీరు కూడా తనలాగానే ఉండాలని జనసేన కార్యకర్తలకు సూచించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vanga Brothers Lost Track Already?

Sandeep Reddy Vanga might have been one of the most celebrated directors of this generation…

14 minutes ago

Mythri’s 418 Trailer: Supernatural Horror Thriller

Fear gets a new face in 418, and it belongs to Chaithra Achar. The newly…

52 minutes ago