
[m9ad]
ఈ కధ మొత్తం పక్కన పెట్టేస్తే తాజాగా టాలీవుడ్ లో ఒక మ్యాటర్ బలంగా వినిపిస్తుంది అది ఏంటి అంటే, ఈషా రెబ్బాకి రాజమౌళి తన టాలీవుడ్ మల్టీ స్టారర్ “ఆర్.ఆర్.ఆర్”లో అవకాశం ఇచ్చాడు అని, అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఆమె నటిస్తుంది అని. ఇక ఈ విషయంపై ఈషా కూడా స్పదించింది. అదంతా అబద్దం అని, అసలు నన్ను ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి ఎవ్వరూ అడగలేదు అని, కానీ ఈ అబద్డమే నిజం అయితేఎంత బావుంటుందో అని, ఎందుకంటే ఆ సినిమాలో అవకాశం దొరికితే తన కరియర్ పూర్తిగా మారిపోతుంది అని, మరో పక్క ఎన్టీఆర్, చెర్రీ లాంటి బడా హీరోలతో నటించే అవకాశం లభిస్తుంది అని ఈషా చెబుతుంది.
ఇక అరవింద సమేతాలో కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రే అని ముందే తెలిసినా ఎన్టీఆర్ తో కలసి నటించే అవకాశం కోసం, మరో పక్క త్రివిక్రమ్ లాంటి బడా దర్శకుల సినిమాలో యాక్ట్ చెయ్యడం కోసం ఒప్పుకున్నాను అని చెబుతుంది ఈ అమ్మడు. మరి ఆ అబద్దం నిజం అవుతుందో లేక అబద్దంగానే మిగిలిపోతుందో చూడాలి.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…