
“బాక్సర్” పేరుతో రిజిస్టర్ అయిన ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? వంటి పలు ప్రశ్నలు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాను తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారనే సమాచారమే ఈ టైటిల్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముందుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని భావించినప్పటికీ, ‘జనతా గ్యారేజ్’ తర్వాత వక్కంతం వంశీ బరిలో నుండి పక్కకు జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
దీంతో యంగ్ టైగర్ తదుపరి చిత్రం ‘టెంపర్’ దర్శకుడు పూరీతోనే అని, అక్టోబర్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుని, డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ‘బాక్సర్’ టైటిల్ పూరీ కాంపౌండ్ నుండి వచ్చినదేనా? ‘బాక్సర్’గా నటించబోయేది బుడ్డోడేనా? అన్న ఉత్సుకత యంగ్ టైగర్ అభిమానుల్లో నెలకొంది.
Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…