
అయితే తాజాగా మహేష్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూడా పయనించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో “నాన్నకు ప్రేమతో” వంటి ఒక విలక్షణమైన సినిమాను నిర్మాత ప్రసాద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే తొలి 50 కోట్ల సినిమాగా రికార్డులకెక్కింది. కమర్షియల్ విజయం కంటే కూడా, ఒక విలక్షణమైన సినిమాగా, చిత్ర యూనిట్ కు మంచి కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెట్టింది.
ఈ ఖ్యాతికి ఉప్పొంగిన నిర్మాత ప్రసాద్ తాజాగా సుకుమార్ కోసం ఓ ‘బిఏండబ్ల్యూ’ కారును బహుమతిగా అందజేయడం విశేషం. ‘బిఏండబ్ల్యూ’ సిరీస్ లో దాదాపు 50 లక్షల విలువ గల ‘ఎక్స్ 3’ మోడల్ కారును బహుమతి అందించారు. చూడబోతుంటే… దర్శకులకు కార్లను బహుమతిగా ఇవ్వడం టాలీవుడ్ లో సరికొత్త ‘ట్రెండ్’గా కనపడుతోంది. ఏది ఏమైనా… ప్రతిభకు ఈ విధంగా పట్టం కట్టడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే.
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…
Adivi Sesh’s Goodachari 2 has got a strong reaction even though the shooting is still…