
Jagan 2.0 and YSRCP's 2029 Comeback Plans
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు. కనుక ఈ ఎన్నికల ఫలితాల గురించి కూటమి నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన చెందితే సహజమే. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు.
ఎంత ఆందోళన చెందినా ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గ్రహించినట్లే ఉన్నారు. కనుక తమ ఓటమికి రకరకాల సాకులు సిద్ధం చేసుకొని వాటన్నిటికీ సిఎం చంద్రబాబు నాయుడే బాధ్యులని నిందిస్తున్నారు కూడా.
కానీ విచిత్రమేమిటంటే, ఈ ఎన్నికలలో గెలవలేకపోయినా 2029 శాసనసభ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని చెబుతున్నారు. ఇంత చిన్న ఎన్నికల్లో గెలవలేనప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తుందనడం ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతున్నట్లు అనిపిస్తుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పధకాలతో ప్రజలకు డబ్బు పంచారు. కనుక 175/175 అని చెప్పుకోవడానికి ఓ కారణం కనిపిస్తోంది. అయితే 175/175 పై ఒక్క జగన్ తప్ప పార్టీలో ఎవరూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే అది అసాధ్యమని వారికీ తెలుసు కనుక. అది అప్రస్తుతం.
కనుక కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతోందనే జగన్ గుడ్డి నమ్మకం తప్ప ‘జగన్ 2.0’కి బలమైన కారణం ఒక్కటీ కనిపించడం లేదు. అమరావతి, పరిశ్రమలు, రాష్ట్రాభివృద్ధి విషయంలో జగన్ విధానాలు, అధికారంలోకి వస్తే టీడీపీపై రాజకీయ ప్రతీకారం తప్పదని చెపుతుండటం వంటివి వైసీపీకి ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి.
కానీ కూటమి నుంచి జనసేనను విడదీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయని భావిస్తున్నారేమో? లేదా వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దాని సాయంతో కూటమిని దెబ్బ తీయగలమని భావిస్తున్నారేమో? లేదా ఏపీ కంటే ఆరు నెలల ముందు జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, ఆయన తనకు సహాయపడతారని జగన్ ఆశపడుతున్నారేమో?
ఏది ఏమైనప్పటికీ, పగటి కలలు కనడంపై రాజ్యాంగంలో ఎటువంటి సెక్షన్స్ లేవు. కనుక మరో మూడేళ్ళు కళ్ళు మూసుకుని పగటి కలలు కనొచ్చు. వారి ఈ హక్కుని ఎవరూ కాదనలేరు.
A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…
తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇవి కాక వామపక్షాలతో సహా మరో అరడజను పార్టీలు…