
సోషల్ మీడియా అంటే యు ట్యూబ్ వీడియోస్, షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అనుకుంటున్న వారికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్లు సోషల్ మీడియా అంటే వినోదం మాత్రమే అనుకున్న వారికీ అది ఒక ఎన్నికల ఆయుధం అని, ఎన్నికల ఫలితాలను నిర్దేశించే ఒక దివ్యాస్త్రమని చాటి చెప్పారు స్టాలిన్.
డీఎంకే ఓటమికి, టీవీకే విజయానికి, తన పరాభవానికి, విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి వారధిగా నిలిచింది ఇన్ స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియా పవర్ ను రాజకీయ పార్టీల అధినేతలకు వివరించారు స్టాలిన్. సోషల్ మెదిలాయి ప్రభావంతోనే విజయ్ ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్లగలిగారు అంటూ తన ఓటమికి తన పార్టీ పరాజయానికి ఇన్ స్టా నే కారణం అంటూ కుండబద్దలు కొట్టారు స్టాలిన్.
ఎన్నికల పోలింగ్ బూత్ లో కనీసం ఏజెంట్లు కూడా లేని విజయ్ టీవీకే పార్టీ రాష్ట్రంలో ఏకంగా 108 స్థానాలలో గెలుపొంది దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలను మట్టికరించిందని, బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు అందని ద్రాక్షగా ఉన్న అధికారాన్ని అందుకుందని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ విజయ్ విజయ రహస్యాన్ని భయపెట్టారు.
అయితే నిజంగా స్టాలిన్ అనుకున్నట్టుగా విజయ్ టీవీకే గెలుపు లో ఇన్ స్టాగ్రామ్ పాత్ర ఉందా.? ఇన్ స్టా అనేది ప్రస్తుత యూత్ ఎక్కువగా వినియోగిస్తున్న ఒక సోషల్ మీడియా వేదిక. ప్రభుత్వ తప్పిదాలను ప్రచారం చేయడానికి తమకు నచ్చిన వ్యక్తిని అందళం ఎక్కించడానికి అవసరమైన కంటెంట్ ను ప్రచారం చేయడానికి ఇన్ స్టా యూత్ కి ఒక వేదిక గా మారిందా.?
స్టాలిన్ చెపుతున్నట్టుగా విజయ్ కి అనుకూలంగా ఇన్ స్టా రీల్స్ టీవీకే విజయాన్ని ప్రభావితం చేయగలిగిందా.? వాటి ద్వారా ఓటర్లను టీవీకే తమ వైపుకి ఆకర్షించుకోగలిగిందా.? అంటే పూర్తిగా విజయ్ గెలుపు ను ఇన్ స్టా ఖాతాలో వెయ్యలేము కానీ సింహ భాగం నేటి యువత సోషల్ మీడియా కు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారని చెప్పొచ్చు.
వారు తమిళనాడు రాజకీయాలను మార్చే దిశగా సోషల్ మీడియా సాయంతో తమ కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి ఉండవచ్చు. విజయ్ తమిళనాట భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఒక స్టార్ హీరో. అందునా ఎన్నికలకు ముందు విజయ్ ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు ప్రజలలో విజయ్ పట్ల సానుభూతిని తీసుకొచ్చాయి.
కరూర్ తొక్కిసలాట ఘటన, ఆయన చివరి చిత్రంగా నిర్మించిన జననాయకన్ విడుదలలో జరిగిన జాప్యం, దానికి తోడు మూవీ HD ప్రింట్ సోషల్ మీడియాలో, స్థానిక కేబుల్ ఛానెల్స్ లో ప్రసారం అవ్వడం, విజయ్ అతని భార్య విడాకుల కేసు, త్రిష వివాదం, విజయ్ ఒంటరి పోరు అన్ని కలగలిపి విజయ్ ని రాజకీయంగా ప్రజలకు దగ్గర చేసాయి.
ఒక్కడికి వ్యతిరేకంగా ఇన్ని రాజకీయ కుట్రలా అన్న భావన తమిళనాట యువతలో ముఖ్యంగా విజయ్ అభిమానులలో ఆవేదనను కలిగించాయి. వాటి ఫలితమే విజయ్ కి అనుకూల ప్రచారం చేసేందుకు, ఆయన పై జరుగుతున్న రాజకీయ కుట్రలను తెలియచేసేందుకు విజయ్ అభిమానులు సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు.
ఆ ఒక్క ఆలోచన దశాబ్దాల నాటి రాజకీయ పార్టీల రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తమిళనాడు రాజకీయాలలో కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టింది. స్టాలిన్ చేసిన ఈ ఒక్క ప్రకటన రేపు భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలకు, పార్టీల నేతలకు సోషల్ మీడియానే ప్రధమ ఆయుధం కానుంది అనేది సుస్పష్టమయ్యింది.
వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలకు ఏమైనా రాజకీయ ఎదురు దెబ్బలు తగిలినా, అలాగే వారికి, వారి పార్టీలకు ఎవరి నుంచైనా రాజకీయ…
After Vijay achieved a massive political victory in Tamil Nadu and officially became Chief Minister,…