Telugu

చలపతిరావును కేసు వదిలేలా లేదుగా!

ఓ సినిమా వేడుకలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు చలపతిరావుపై నమోదైన కేసును చాదర్‌ ఘాట్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మే 18న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన చలపతిరావు యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

ADVERTISEMENT

సీనియర్ నటుడైన ఆయన మహిళలను కించపరిచేలా మాట్లాడారని, చలపతిరావు వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. చలపతిరావు వ్యాఖ్యలపై అదే రోజు చాదర్‌ ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఘటన జరిగింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇది ఆంధ్రా ప్రజల ఉసురా.. బీఆర్ఎస్‌ కర్మ ఫలమా?

నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆయనను…

12 minutes ago

Action Or Warning? Konda Surekha In Spotlight

The Congress party is historically famous for leading group politics. There is very little dirty…

31 minutes ago