
టీడీపీ, టీఆర్ఎస్‌లు తనను వేధిస్తున్నాయని, తనకు అప్రూవర్‌గా మారే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనను ఉపయోగించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరికించాలన్న ప్రయత్నం జరుగుతోందని, తనకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. వాస్తవాలను బయటకు చెప్పే అవకాశం కల్పించాలని కోరారు. క్రైస్తవ సమస్యలపై మాట్లాడడానికే తాను స్టీఫెన్‌ను కలిశానని మత్తయ్య స్పష్టం చేశారు.
కేసు హైకోర్టులో ఉన్నప్పుడు టీడీపీ తనకు సహకరించిందని, సుప్రీంకోర్టులో తనకు ఎవరూ సహకరించలేదని పేర్కొన్నారు. తనకు కేటీఆర్ ఫోన్ చేసిన సమయంలో ఆయనను ఇరికించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్న మత్తయ్య, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ గురించి కొన్ని వాస్తవాలు బయటకు చెప్పాల్సి వుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…