
జగన్ అధికారంలోకి రాక ముందే అక్రమాస్తుల భాగోతం నడిపించి జైలుకి వెళ్ళి వచచ్చిన ఘనుడు. అధికారంలోకి వచ్చాక యావత్ ప్రభుత్వ యంత్రాంగం చెప్పు చేతలలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడకుండా ఉంటారా?అందుకే 5 ఏళ్ళ పాలనలో జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ అందినకాడికి దోచేసుకున్నారు.
అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడే కుట్ర చేశారని వాదించారు. గొడ్డలి వేటుకి బలైన వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పిన జగనే, ఈ హత్యని చంద్రబాబుకి అంటగట్టేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి వివేకా కూతురు, అల్లుడుకి ఈ హత్యతో సంబంధం ఉందని అడ్డుగోలుగా వాదించారు. ఈ కేసు విచారణ జరూపుతున్న సీబీఐ అధికారులను చంద్రబాబు నాయుడే మేనేజ్ చేస్తున్నారంటూ వారిపై ఎదురుకేసులు పెట్టించారు.
కోడికత్తి, గులకరాయి భాగోతాలు, కాకినాడ పోర్టు కబ్జా మొదలు పెద్దిరెడ్డి ఆటవీభవవముల కబ్జాల వరకు చేయకూడని నేరాలు, ఘోరాలు నిర్భయంగా చేసేస్తుండేవారు.
కానీ పట్టుబడితే “మేమందరం కడిగిన ఆణి ముత్యాలం. ప్రజలకు ఉపకారం చేయడమే తప్ప మరేదీ మాకు తెలియదు. మేము ఏ పాపమూ ఎరుగము.. అవన్నీ నిజం కావు. అవన్నీ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల కుట్రలే అని గట్టిగా వాదిస్తూ తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ప్రజలందరూ గొర్రెలు… మేము ఏం చెప్పినా అదే నిజమని గుడ్డిగా నమ్మేస్తారని వైసీపీ నేతలు అనుకుంటున్నట్లు భావించవచ్చు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడినప్పుడు జగన్, వైసీపీ నేతలు వారి సొంత మీడియా అచ్చం ఇలాగే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు తిరుమలలో ఎన్నడూ నెయ్యి కల్తీ జరుగలేదని, చంద్రబాబు నాయుడుకి పాలన చాతకాక, ఇచ్చిన హామీలు అమలుచేయలేక ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కొత్త డ్రామా మొదలుపెట్టరని జగన్ అండ్ కో వాదించారు.
కానీ ఆ కేసులో సీబీఐ అధికారులు పలువురిని అరెస్టులు చేస్తుండటంతో ఇప్పుడు వారు సమర్ధించుకోలేని స్థితిలో ఉన్నారు.
కల్తీ నెయ్యి ఉత్తిదే.. అది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అని జగన్ వాదించారు కనుక వైసీపీలో ఎవరూ ఇప్పుడు భయపడకూడదు. ఆందోళన చెందకూడదు. కానీ సీబీఐ తీగలాగితే వైసీపీ డొంక కదులుతుందని వేరే చెప్పక్కర లేదు. అటకెక్కిపోయిందనుకున్న ఈ కేసులో హటాత్తుగా అరెస్టులు మొదలవడంతో వైసీపీలో కలకలం మొదలైంది.
ఇప్పటికే ఒక్కో వైసీపీ నేత మెడకు ఒక్కో కేసు చుట్టుకుంటోంది. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసు వైసీపీలో ఎవరి మెడకు చుట్టుకుంటుందో అందరికీ తెలుసు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడుపై మళ్ళీ ఎదురుదాడి చేయవచ్చు. గుమ్మడి కాయల దొంగలే భుజాలు తడుముకుంటారు కనుక ముందుగా ఎవరు ఎదురుదాడి చేస్తారో వారే ఈ అవినీతికి పాల్పడ్డారని చాటింపు వేసుకున్నట్లే! అయినా తిరుమల వెంకన్నకే నామాలు పెట్టాలనుకుంటే ఏమవుతుందో వైసీపీకే బాగా తెలుసు కదా?
Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…
BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…