
పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని తనకు తెలిసిందని, సీబీఐ ఎంక్వయిరీలంటూ వైసీపీ, జనసేనతో ఆరోపణలు చేయించి, విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలన్నది బీజేపీ ఉద్దేశమని ఆరోపించారు. నదుల అనుసంధానానికి కీలకమైన పట్టిసీమపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతోనే పోలవరం నిర్మిస్తున్నామని, రాష్ట్రం నిర్మిస్తే మరింత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావించిన మీదటే, నిర్మాణ బాధ్యతలను తాను నెత్తిన వేసుకున్నానని అన్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…