
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు దేశంలో ఏ వ్యవస్థలకైనా ప్రధాని నరేంద్రమోడీ ఆజ్ఞ అవసరమే అంటే అతిశయోక్తి కాదు. మోడీ వద్దనుకుంటే ఈడీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత జోలికి వెళ్ళగలిగేదా?మోడీ వద్దనుకుంటే ఆ కేసు అటకెక్కిపోలేదా?
మోడీ వద్దనుకుంటే జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగలిగి ఉండేదా?మోడీ వద్దనుకుంటే చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించి ఉండేదా?మోడీ వద్దనుకుంటే వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ కదిలేదా? వద్దనుకుంటే విచారణ పూర్తవుతుందా?
మోడీ వద్దనుకుంటే ఏపీ ఓటర్ల జాబితాలో వైసీపి ఇన్ని అవకతవకలకు పాల్పడుతుంటే, ఎన్నికల సంఘం అధికారులు కళ్ళు మూసుకుని ఉండేవారా? అని ఆలోచిస్తే ప్రధాని నరేంద్రమోడీ ‘సర్వాంతర్యామి’ అని అర్దమవుతుంది.
ఈవిషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు కనుకనే రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసేందుకు మోడీ సహాయసహకారాలు అవసరమని భావిస్తున్నారు. అయితే ‘గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలి…’ అంటే ఆ దేవుడు కూడా పట్టించుకోడన్నట్లు మానవ ప్రయత్నం కూడా అవసరమనే నేడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ విజయవాడకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమీషన్ బృందాన్ని కలిసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపి ఏవిదంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తోందో వివరించారు.
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ముందుగా ఈ ఓటర్ల జాబితాలలో అవకతవకలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాజ్యాంగబద్దత లేని వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని వైసీపి ఏవిదంగా వాడుకుంటుందో వివరించి, వారిని ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికలలో టిడిపి, జనసేనల ఏజంట్లుగా అనుకున్నవారిపై జగన్ ప్రభుత్వం ఏదో ఓ పేరుతో పోలీస్ కేసులు నమోదు చేయిస్తూ, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచేందుకు కుట్రలు చేస్తోందని ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలన్నీ సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కనుక ఎన్నికల కమీషనర్లకు తెలియవనుకోలేము. కనుక ముందుగా ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను వారు సరిచేయాల్సి ఉంటుంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ ఆశీర్వాదం ఉందనే భావించవచ్చు.
కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఎన్నికల కమీషన్ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేయడం పూర్తయింది కనుక ఓసారి ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కూడా దర్శించుకుని తమకు ఆయన ఆశీర్వదాలు ఉన్నాయో లేవో తెలుసుకుని వస్తే మంచిదేమో?ఒకవేళ ఉంటేనే ఈ ఫిర్యాదు బ్రహ్మాస్త్రంగా మారుతుంది లేకుంటే చెత్తబుట్టలోకే!
There is a strong sense of mythology and divine energy running through the teaser of Kurmaavatar,…
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…