
Celebrity posts spark a privacy debate
ఆనందం మనదే.. బాధ మనదే.. జీవితంలో ఎదురయ్యే ప్రతి భావోద్వేగం కూడా మనదే. వాటిని కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో పంచుకోవడం సహజం. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని కూడా పబ్లిక్ చేయడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెలబ్రిటీల విషయంలో ఇది మరింత ఎక్కువ. ఏదైనా పంచుకుంటే అభినందనలు వస్తాయి.. అదే సమయంలో ట్రోలింగ్ కూడా తప్పదు.
నటి సమంతను తీసుకుంటే.. విడాకుల తర్వాత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురైన ఇబ్బందులను ఆమె బహిరంగంగానే పంచుకున్నారు.
అనారోగ్యం, సినిమాల ఫలితాలు, తిరిగి నిలబడేందుకు చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. అప్పట్లో ఆమెకు మద్దతు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.
ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ఆనందం.. మరోవైపు ‘మా ఇంటి బంగారం’ విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఒక ప్రశ్న. వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న తర్వాత ఏదైనా అనుకోని పరిణామం ఎదురైతే, అదే వ్యక్తులు ప్రజలను తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతుంటారు. ప్రైవసీ కోరుకోవడంలో తప్పు లేదు. కానీ తామంతట తామే అన్ని విషయాలు పబ్లిక్ చేసేసుకొని, ఆ తర్వాత తమ విషయంలో కలుగాజేసుకోవద్దంటే సాధ్యమా?
ఎంత సెలబ్రిటీలు అయినా వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవాల్సిన అవసరం ఉందా? గర్భధారణ వంటి అత్యంత వ్యక్తిగత విషయాలను, ఫోటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తద్వారా ఏమి ఆశిస్తున్నారు?
అభిమానులతో ఆనందాన్ని పంచుకోవడం తప్పు కాదు. కానీ సోషల్ మీడియా మన కుటుంబం కాదు. అక్కడ ఒకసారి చెప్పిన విషయం మన నియంత్రణ దాటి పోతుంది. అందుకే ఏం పంచుకోవాలో.. ఏం పంచుకోకూడదో తెలుసుకోవడం సామాన్యులకు, సెలబ్రిటీలకు కూడా చాలా అవసరం.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం…
Whenever Allu Arjun and Boyapati Srinu are mentioned together, Sarrainodu naturally comes to mind. But…