Telugu

వైసీపీ ‘కోర్టు’లలో యుద్ధం చేస్తుందా.?

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం ఉండకూడదని, క్షేత్ర స్థాయిలో అందరు యుద్ధం చెయ్యాల్సిందే అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు.

అయితే స్థానిక ఎన్నికల గెలుపు కోసం ఒకపక్క బహిరంగంగా పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో యుద్ధం చెయ్యమని ఆదేశించిన జగన్ మరోపక్క స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు అదే పార్టీ నేతలను న్యాయపోరాటానికి ఉసికొల్పుతున్నారా.?

ADVERTISEMENT

ఇటీవల స్థానిక ఎన్నికలలో 34% బీసీ రిజర్వేషన్ అమలు కోసం కూటమి ప్రభుత్వం, సర్ ప్రకియ పూర్తి అయ్యేవరకు స్థానిక ఎన్నికలను నిలిపివేయాలంటూ వైసీపీ ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం అనూహ్యంగా ఈ ఇద్దరి ప్రతిపాదనలను తోసిపుచ్చుతూ ఆరు వారాలలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ తీర్పు ప్రకటించింది.

దీనితో స్థానిక ఎన్నికలలో వార్డుల విభజన, సర్ అంశాల పై హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ వైసీపీ సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించింది. ఇందుకోసం వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, పాత జాబితా ఆధారంగా ఎన్నికలు వద్దంటూ వైసీపీ తన వాదన వినిపించింది.

అయితే వైసీపీ వేసిన ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణ జరుపుతామంటూ ధర్మాసనం ప్రకటించింది. దీనితో తమ పిటిషన్ ను వెంటనే విచారణకు స్వీకరించాలని, ఏ క్షణంలో అయినా స్థానిక ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తమ పిటిషన్ ను సత్వరమే విచారణ జరపాలంటూ వైసీపీ తరుపు న్యాయవాది న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.

అయితే జగన్ పార్టీ క్యాడర్ ని, లీడర్లను క్షేత్ర స్థాయిలో యుద్ధం చెయ్యమని చెప్పి, మరోపక్క అవే ఎన్నికలను అడ్డుకునేందుకు న్యాయస్థానంలో యుద్ధం చేస్తున్నారా అంటూ జగన్ ద్వంద్వ వైఖరి మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కూటమి మద్దతుదారులు.

రాష్ట్ర ప్రజలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజా వ్యతిరేకత వచ్చేసిందని, డీఎస్సీ అక్రమాలతో ఆ వ్యతిరేకత మరింత తీవ్ర రూపంలోకి మారిందని, క్షేత్ర స్థాయిలో కూటమి నేతలు ప్రజలలో తిరిగే పరిస్థితి లేదని, ఇప్పటికిప్పిడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీనే అని,

ప్రజలలో జగన్ పట్ల నమ్మకం ఏ మాత్రం తగ్గలేదని, రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ వచ్చేది మేమే అంటూ తొడలు కొడుతున్న వైసీపీ ఇలా స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి కోర్టుల చుట్టూ ఎందుకు ప్రదక్షణలు చేస్తున్నట్టు.? ఇంతకీ స్థానిక సంస్థల సమరానికి వైసీపీ సిద్ధమా.? కాదా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sarrainodu Combo, But With A Bigger Game?

Whenever Allu Arjun and Boyapati Srinu are mentioned together, Sarrainodu naturally comes to mind. But…

11 minutes ago

Rs 40 Cr Supari For Viveka Murder: CBN Reveals Details!

The highly controversial murder of former MP and the brother of late CM YS Rajasekhar…

42 minutes ago