రోహిత్ వేముల పై రహస్య సమాచారం సేకరించిన కేంద్రం!

దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పెను కలకలం రేపిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కీలక మలుపు తీసుకుంటోంది. వేధింపులు భరించలేక దళితుడైన రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలపై వర్సిటీ వీసీ అప్పారావు సహా, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీలో రోహిత్ వేముల ప్రత్యర్థి వర్గంగా పేరుపడ్డ ఏబీవీపీ విద్యార్థు, రోహిత్ అసలు ఎస్సీనే కాదని ఆరోపించారు. ఆ తర్వాత తాము ఎస్సీ వర్గానికి చెందిన వారం కాదని, తమది వడ్డెర కులమని రోహిత్ తండ్రి మణికుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దీనిపై దృష్టి సారించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. దోవల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఈ విషయంపై సమగ్ర వివరాలు సేకరించాయి. ఇందులో భాగంగా రోహిత్ తల్లి రాధికతో పాటు అతడి నాయనమ్మ రాఘవమ్మ వాంగ్మూలాలను కూడా సేకరించారు. ఈ వాంగ్మూలంలో తాము వడ్డెరలమేనని పేర్కొన్న రాఘవమ్మ, దళితులం కాదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సమగ్ర నివేదికతో పాటు రాధిక, రాఘవమ్మల వీడియో వాంగ్మూలాలను జతచేసిన నివేదికను నిఘా వర్గాలు అజిత్ దోవల్ కు బుధవారం నాడు అందజేశాయి. దీంతో రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసు మరో మలుపు తీసుకోబోతుందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Share
Published by

Recent Posts

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

26 minutes ago

బాలయ్య వారసత్వం మోక్షజ్ఞ చేతుల్లో… అసలు పరీక్ష మొదలు

నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…

26 minutes ago