Telugu

ఎలా ఉంది… యాజిటిజ్ గా అలానే ఉంది..!

మెగాస్టార్ చిరంజీవి పాటలను తొలుత రామ్ చరణ్ తేజ్ రీమిక్స్ చేయగా, ఆ తర్వాత దానిని సాయిధరమ్ తేజ్ వారసత్వంగా అందుకున్నాడు. అయితే ఈ రీమిక్స్ పాటలలో శ్రోతలను మెప్పించిన వాటి కంటే విమర్శలకు తావిచ్చినవే ఎక్కువ. దీంతో గత చిత్రాలలో రీమిక్స్ పేరుతో దాదాపుగా అవే పాటలను తాజా గాయకులతో ఆలపిస్తూ విడుదల చేస్తున్నారు. అదే ‘ఇంటిలిజెన్స్’ను సాయిధరమ్ తేజ్ “ఇంటిలిజెంట్” సినిమాలో కూడా వాడారు.

ADVERTISEMENT

మెగాస్టార్ ‘చమకు చమకు చాం’ అనే పాటను యాజిటిజ్ గా అలాగే ఉంచేస్తూ విడుదల చేయడంతో… మెప్పించడం పక్కన పెడితే, చెడగొట్టారన్న విమర్శలకు అయితే తావివ్వలేదు. దీంతో ఈ పాటపై అటు మెగాస్టార్ అభిమానుల్లోనూ, ఇటు సంగీత ప్రియుల్లోనూ పాజిటివ్ ఫీలింగ్స్ కలిగాయి. ఈ పాట రీమిక్స్ చేసిన విధానంలో దర్శకుడు వినాయక్ పనితనం కనపడుతోంది. గతంలో ‘నాయక్’ సినిమాలో కూడా ఇదే తరహాలో థమన్ చేత రీమిక్స్ చేయించిన విషయం తెలిసిందే.

ఇక తాజా పాటను ఎస్పీ చరణ్ మరియు హరిణిలు ఆలపించగా, ఎలాంటి ప్రయోగాలు చేయకుండా థమన్ సంగీతం అందించాడు. ఈ పాటను ఎంత బాగా రీమిక్స్ చేసారంటే… పాటలోని కాస్ట్యూమ్స్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి నాడు వినియోగించిన విధంగానే సాయికి వేయడం విశేషం. గతంలో ‘సుప్రీమ్’ సినిమాలో కూడా మెగాస్టార్ వినియోగించిన తరహా కాస్ట్యూమ్స్ నే వాడి, వీక్షకులను మెప్పించగా, మళ్ళీ అదే రూట్ ను ఫాలో అయ్యారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Assembly But Took 1.24 Cr Salary?

The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…

19 minutes ago

Maremma Trailer: A Riveting Story of Soil

Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…

45 minutes ago