Telugu

ఛార్మి విచారణ – మీడియా హైలైట్స్ ఇవే!

ఎవరెంత గోల చేసినా సిట్ విచారణలో జరుగుతున్న అంశాలు మీడియాకు లీక్ కాకుండా మాత్రం చూడలేకపోతున్నారు. సర్వత్రా ఉత్కంఠ రేపిన ఛార్మి విచారణ సందర్భంగా కూడా కొన్ని లీకులు మీడియాలో ప్రధానంగా ప్రసారమవుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన సమాచారం ఛార్మి నుండి వస్తుందని సిట్ అధికారులు అంచనా వేస్తున్న నేపధ్యంలో… మీడియా వర్గాల్లో ప్రసారం అవుతోన్న కధనాల ప్రకారం అసలు ఛార్మి విచారణ ఎలా సాగుతుందో చూద్దాం…

ఉదయం 10 గంటల నుంచి హీరోయిన్ చార్మీని సిట్ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలను పరిశీలిస్తే…
ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా?
సమాధానం: నేను డ్రగ్స్ తీసుకోను.
ప్రశ్న: మీరు పబ్ లకు వెళతారా?
సమాధానం: వెళ్తాను.
ప్రశ్న: పబ్స్ లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందా?
సమాధానం: ఆ విషయం నాకు తెలియదు.
ప్రశ్న: కెల్విన్ తో మీకు పరిచయం ఉందా?
సమాధానం: ఓ ఈవెంట్ లో పరిచయం అయ్యాడు.
ప్రశ్న: కెల్విన్ తో మీరు వెయ్యికి పైగా వాట్స్ యాప్ మెసేజ్ లను పంచుకున్నారు. దీనిపై మీరేమంటారు?
సమాధానం: (మౌనం)
ప్రశ్న: జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీలు దిగారా?
సమాధానం: అందరితో దిగినట్టే, అతనితోనూ దిగాను.
ప్రశ్న: పూరీ జగన్నాథ్ మీకు స్నేహితుడేనా?
సమాధానం: అవును.
ప్రశ్న: పూరీ డ్రగ్స్ వాడతారా?
సమాధానం: వాడరు. ఆయన డ్రగ్స్ కు వ్యతిరేకి.
ప్రశ్న: మీకు ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: లేదు.
ప్రశ్న: పూరీకి ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: తెలియదు.
ప్రశ్న: పూరీ ఇంటర్నేషనల్ సిమ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి కదా?
సమాధానం: (మౌనం)

ADVERTISEMENT

వీటితో పాటు మీరు పార్టీలు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళతారు? ఎవరితో వెళతారు? పూరీ జగన్నాథ్ ఇంటిపై బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రూములు ఉన్నాయా? ఆయన ఇంట్లోనే మత్తు మందులు తీసుకుంటారా? డ్రగ్స్ ఫెస్టివల్స్ జరుగుతాయన్న వార్తలు నిజమేనా? అవి ఎక్కడెక్కడ జరుగుతాయి? పంజాబ్ నుంచి మీ బంధువులు ఎవరైనా డ్రగ్స్ తీసుకువచ్చారా? వాటిని ఎవరికి ఇచ్చారు? సినిమా స్టోరీల డిస్కషన్ వేళ, పూరీ డ్రగ్స్ తీసుకుంటారా? ఆయన నుంచి మీకు డ్రగ్స్ వచ్చాయనడానికి మా వద్ద ఆధారాలు ఉన్నాయి… మీ సమాధానం?

విదేశీ టూర్లకు వెళితే ఎక్కడ గడిపేవారు? ఏం చేసేవారు? వీకెండ్ లో పబ్బులకు వెళ్లే అలవాటు మీకు ఎక్కువేగా? సినిమా ఈవెంట్లు ముగిశాక, ఏ తరహా పార్టీలు ఉంటాయి? డ్రగ్స్ వాడకం చాలా కామన్ అట కదా? కెల్విన్ పరిచయం సుదీర్ఘంగా సాగడానికి కారణం ఏంటి? అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత నేతృత్వంలోని సీఐలు జయలక్ష్మి, రేణుక, శ్రీలతలు చార్మిని విచారిస్తుండగా, ఆమె ముక్తసరిగా చెబుతున్న సమాధానాలను బయటి నుంచి సిట్ ఉన్నతాధికారులు పరిశీలిస్తూ, అనుబంధ ప్రశ్నలను మహిళా అధికారులకు పంపుతున్నారు.

ఇదిలా ఉంటే… ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఛార్మీ ఫిర్యాదు చేసింది. తాను కార్యాలయానికి వచ్చిన సమయంలో కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రధాన ద్వారానికి అడ్డుగా నిల్చున్నారని, వారిని ఛేదించుకుంటూ రావడం కష్టమైందని చెప్పింది. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన చేతులు పట్టుకుని లాగేందుకు కొందరు ప్రయత్నించారని, శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని ఫిర్యాదు చేసింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Toxic: Yash Not Even Sparing X Users? More Negativity

A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…

11 minutes ago

కేసీఆర్‌ ఎదురు చూస్తున్న ఆ ఘడియలు వచ్చేశాయా?

కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్‌ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…

17 minutes ago