Telugu

చంద్రబాబు, కేసీఆర్ లకు ఒకేసారి జలక్ ఇచ్చిన కేంద్రం!

రాష్ట్ర విభజనతో తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నాయకులు అధికార పక్షంలోకి జంప్ చేసిన సంగతులు తెలిసినవే. సాధారణంగా జరిగే జంపింగ్ ల కన్నా, ఈ సారి మోతాదు ఎక్కువగా ఉండడంతో ఒక విధంగా తెలంగాణాలో టిడిపి, ఏపీలో వైసీపీ అధికార పక్షాలపై తీవ్రంగా మండిపడ్డాయి. అయితే ఇంతమందిని చేర్చుకోవడం వెనుక పెద్ద రాజకీయ ప్రణాళికే ఉందన్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే.

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచుకోవచ్చనే సౌలభ్యం విభజన చట్టంలో ఉండడంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలను 225కి, తెలంగాణాలో ఉన్న 119 స్థానాలను 175కు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నిజానికి ఈ పెంపు సాధ్యమవుతుంది కాబట్టే తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ‘ఫిరాయింపులను’ ప్రోత్సహించారని పొలిటికల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా కేంద్రం ఇచ్చిన వివరణతో ఈ ఇద్దరి ముఖ్యమంత్రులకు పెద్ద జలక్కే ఇచ్చినట్లయ్యింది.

ADVERTISEMENT

నియోజక వర్గాలను పెంచాలంటే ఖచ్చితంగా 371 ఆర్టికల్ ను సవరించాలని, ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని స్పష్టత ఇచ్చింది. నిజానికి డీలిమిటేషన్ ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పెంపుదలకు అవకాశం లేకుండా గతంలో పార్లమెంట్ లో చట్టాన్ని రూపొందించారు. దీంతో రాజ్యాంగ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అటార్నీ జనరల్ సంప్రదించగా, తాజాగా అటార్నీ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం నియోజక వర్గాల పెంపు ఆశలపై నీళ్ళు చల్లారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా రివ్యూ: దేవకన్యలు సైతం కాపాడలేకపోయారు!

చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…

5 minutes ago

OTT Deal: The Key to Vishwambhara’s Release

Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…

30 minutes ago