Telugu

ఒక్క అరెస్టు…మూడు వాదనలు

నాటి బాబు అరెస్టు పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వారియర్స్ vs సైనిక్స్ గా మారిపోయాయి. మీ కష్టంలో మేము అండగా ఉన్నామంటు సైనిక్స్ వాదిస్తుంటే, మా అధినేత కోసం మేము సైతం కథం తొక్కామంటూనే, మీ అధినేతకు రాజకీయ భవిష్యత్ కి మద్దతు పలకడంతో పాటుగా పవన్ కి ప్రభుత్వంలో పెద్ద పీట వేశామంటూ వారియర్స్ వాపోతున్నారు.

అయితే ఇందులో ఎవరి వాదనని వారు సమర్ధించుకున్నప్పటికీ అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసిన వైసీపీ మాత్రం గోడమీద పిల్లి మాదిరి కూర్చుకుని కాసేపు టీడీపీ తమ్ముళ్లకు అనుకూలంగా మరికాసేపు జనసైనికులకు మద్దతుగా వ్యవహరిస్తూ ఇరు వర్గాల సోషల్ మీడియా యుద్దాలకు అవసరమైన ఇంధనాన్ని సమకూరుస్తుంది.

ADVERTISEMENT

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ “ఒక్క అరెస్టు చుట్టూ మూడు వాదనలు” అన్నట్టుగా ఎందుకింతలా పరిభ్రమిస్తుంది అనేది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న. 2023 సెప్టెంబర్ 9….ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా తారుమారు చేసిన రోజనే చెప్పాలి.

నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ రోజు జరిగిన రెండు సంఘటనలు ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికి చెరపలేని, చెరిగిపోని సజీవ సాక్షాలుగా నిలిచిపోయాయి. ఒకటి అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టు, మరొకటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్బంధం.

అయితే ఈ రెండు సంఘటనలు నాటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. అయితే ఇక్కడ జరిగిన రెండవ సంఘటన మొదటి దానికి రీయాక్షన్ అనేది జనసేన వాదన. ఆ రియాక్షన్ కి 100% స్ట్రైక్ రేట్ మా కృతజ్ఞత అనేది టీడీపీ భావన.

అయితే ఆ ఒక్క అరెస్టు రాష్ట్ర రాజకీయాలలో తెచ్చిన పెను మార్పులు గమనిస్తే…

ఆ ఒక్క అరెస్టు…151 సీట్లతో, వై నాట్ 175 అన్న ఆశతో అందనంత ఎత్తులో ఉన్న వైసీపీ ని 11 సీట్లతో పాతాళానికి తెచ్చింది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి పరిమితం చేసింది.

ఆ ఒక్క అరెస్టు…రెండు చోట్ల ఓడిపోయాడు అనే పవన్ అవమానాన్ని 100% స్ట్రైక్ రేట్ తో తలెత్తుకునేలా చేయడమే కాదు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ వైసీపీ నేతలు చేసిన సవాల్ కి ఉపముఖ్యమంత్రి హోదాతో బదులు చెప్పేలా చేసింది.

ఆ ఒక్క అరెస్టు…సంక్షోభాలకు టీడీపీ ఎన్నడూ తలవంచదనేది గత చరిత్ర మాత్రమే కాదని వర్తమానం తో పాటుగా భవిష్యత్ కి చాటి చెప్పినట్లయింది. ఆ ఒక్క అరెస్టు తెలుగు ప్రజల మనసులో బాబు స్థానం, స్థాయి ఏమిటో తన పార్టీ శ్రేణులతో పాటుగా తన ప్రత్యర్థి పార్టీల నేతలకు కూడా తెలిసొచ్చేలా చేసింది. పొరుగు రాష్ట్రంలో ఆ అరెస్టు తాలూకా వచ్చే రిటర్న్ గిఫ్ట్ లు కూడా అందుకున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు.

అయితే ఇందులో వైసీపీ చేసిన అరెస్టు అధర్మం అనేది టీడీపీ వాదన,

నాటి అరెస్టుకి టీడీపీ కి జనసేన అండగా నిలిచింది అనేది జనసేన అభిప్రాయం,

ఒక్క అరెస్టు ఇద్దరి రాజకీయ శత్రువులను ఒక్కటి చేయగలిగింది అనేది వైసీపీ ఆవేదన….ఇలా ఈ ఒక్క అరెస్టు చుట్టూ మూడు పార్టీలు తమ వాదనలను బలంగానే వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే…టీడీపీ, జనసేన కలయిక కేవలం రెండు పార్టీల రాజకీయ పోత్తో, రెండు కులాల కలయికో, ఇద్దరి వ్యక్తుల స్నేహమో కాదు ఒక రాష్ట్ర భవిష్యత్, రెండు పార్టీల అధికారం, ఇద్దరి వ్యక్తుల గౌరవం….వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ అగ్రనేతల నుంచి పార్టీ క్యాడర్ వరకు అనవసర ప్రకటనలకు, అసందర్భ వ్యాఖ్యలకు సమయం ఇవ్వకపోవడం శ్రేయస్కరం…!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AP Mayor Reservations 2026: Full List of 17 Corporations

The Andhra Pradesh government has reportedly finalised reservations for mayor posts in 17 municipal corporations…

37 minutes ago

AA23: Is One Photo Enough to End the Doubts?

Rumours about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 are spreading like wildfire. From speculation about…

1 hour ago