
Chandrababu Naidu Proposes Investment Security Act
నేడు విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సదస్సులో సుమారు రూ.11 లక్షల కోట్లు పెట్టుబడులకు 160కి పైగా ఒప్పందాలు జరుగబోతున్నాయి.
అయితే ఇలాంటి సదస్సులు, ఒప్పందాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. కనుక ఈసారి ఒప్పందాలపై సంతకాలు జరగక ముందే ఆయా సంస్థల వాస్తవ ఆర్ధిక పరిస్థితి, పెట్టుబడి పెట్టగల సామర్ధ్యం, ఒప్పందం తర్వాత సకాలంలో పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తి చేయగల సామర్థ్యం వంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆ తర్వాతే దాదాపు 160కి పైగా పరిశ్రమలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కనుక ఈ మూడు రోజుల్లో జరుగబోయే ప్రతీ ఒప్పందం నిర్దిష్టమైన గడువులోగా పరిశ్రమలు ఏర్పాటవడం ఖాయం.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రెండున్నరేళ్ళలో తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, సాధించిన పెట్టుబడులు, వాటితో ఏర్పాటవుతున్న పరిశ్రమల పురోగతి గురించి పెట్టుబడిదారులకు వివరించారు. తద్వారా రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి నమ్మకం ఏర్పడుతుంది. మరింత మంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు.
“నాడు సమైక్య రాష్ట్రం మొదలు ఇప్పుడు విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా నా హయంలో 8 సీఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. వాటిలో జరిగిన ఒప్పందాలలో అత్యధిక శాతం కార్యరూపం దాల్చాయి.
మా ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రూ.22.6 లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకోగా, వాటిలో రూ.7.3 లక్షల కోట్లు విలువైన 303 ప్రాజెక్టులు గ్రౌండింగ్‌లో ఉన్నాయని సిఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్‌కు ఒక అనూహ్యమైన అభ్యర్ధన చేశారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతీ ఒప్పందానికి భద్రత కల్పిస్తూ ‘పెట్టుబడుల భద్రతా చట్టం’ చేయాలని కోరారు.
ఇలాంటి చట్టం ఉంటే, ప్రభుత్వాలు మారినా పెట్టుబడిదారులపై రాజకీయకక్ష సాధింపు చర్యలు లేకుండా నివారించవచ్చని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇంతకు ముందు రాజధాని అమరావతి విషయంలో కూడా వైసీపీ ఇలాగే ప్రవర్తించినందున ‘ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని’ అని పార్లమెంటులో చట్ట బద్దత, భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.
ఇదివరకు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కియా, లూలూ గ్రూప్ ఇంకా పలు సంస్థలను వేధించడం దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఈ తాజా ప్రతిపాదన చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
Some films generate buzz through their content, while others keep making headlines for reasons beyond…
Being born into a film family may make your film debut easy. But sustaining a…