
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ఆ పార్టీలో ముఖ్య నేతలు చాలా మంది దీనిలో ఉన్నారని, జగన్ అంతిమ లబ్ధిదారని సిట్ అధికారులు ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాలు సేకరించి ఛార్జ్-షీట్‌లో పేర్కొన్నారు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుని రాష్ట్ర స్థాయిలోనే హ్యాండిల్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. జగన్ కూడా ఇదే కోరుకుంటున్నారు. అప్పుడే ఈ కేసుని కూడా ఆక్రమస్థుల కేసులు, వివేకా హత్య కేసు, కోడికత్తి కేసులా జాబితాలో చేర్చి ఆడుకోగలుగుతారు.
పదేపదే సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి విమర్శించగలుగుతారు. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ చేయిస్తే వైసీపీ చేత పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకొని ప్రజల సానుభూతి కూడా పొందే ప్రయత్నం చేస్తారు… అని సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు.
కనుక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసుని కేంద్రానికి అప్పగిస్తారా లేదా?త్వరలో తెలుస్తుంది.
ఒకవేళ అప్పగితే కేంద్రం ఇక జగన్‌ని వెనకేసుకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ వెనకేసుకువస్తే మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించినట్లవుతుంది.
అలాగని బీఆర్ఎస్ పార్టీలా వైసీపీని బీజేపీలో విలీనం చేసుకోలేదు. చేసుకున్నా మిత్ర ధర్మానికి భంగం కలుగుతుంది కనుక తన నిబద్దతని చాటుకోవడానికి జగన్‌పై చర్యలు చేపట్టక తప్పదు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తే జగన్ జైలుకి వెళ్ళడం అనివార్యమే.. దాంతో రాష్ట్రంలో వైసీపీ అధ్యాయం ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు. మరి సిఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుని ఎలా ముగిస్తారో చూడాలి!
Prabhas and Sandeep Reddy Vanga’s Spirit continues to remain one of the most talked-about upcoming…
The commercial strategy surrounding the release of Peddi has exposed a worrying trend in regional…