
2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు చంద్రబాబు విలువ ఏమిటో తెలిసి వచ్చింది. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ లను తన ఇంటికి పిలిచి అవమానించిన జగన్ తీరుతో అయిదేళ్ల పాటు టాలీవుడ్ నరకం అనుభవించిన వైనం తెలిసిందే.
జగన్ కు ముందు వరకు సినీ సెలబ్రిటీలను అతిధి మర్యాదలతో గౌరవించిన సందర్భాలే గానీ, అవమానించిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన పైనే సూపర్ స్టార్ కృష్ణ వ్యతిరేకంగా సినిమాలు చేసి విడుదల చేసారంటే, నాటి రాజకీయ విలువలు ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు.
అలా టాలీవుడ్ అంటే ఒక ఎవరెస్టు మాదిరి ప్రభుత్వాలు చూసేవి. కానీ జగన్ సీఎం అయ్యాక కధ మొత్తం మారిపోయింది. సింహాసనం పైన కూర్చున్న హీరోలు కాస్త ‘నేల విడిచి సాము చేయాల్సిన’ పరిస్థితి తలెత్తింది. సీఎం ముందు కూర్చుని చేతులు జోడించి, ప్రెస్ మీట్ పెట్టి ‘భజన’ చేయాల్సిన వచ్చింది.
మరోవైపు కేసీఆర్ సర్కార్ ఏమో ‘డ్రగ్స్ కేసు’ను తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఇందులో ఉన్న చిత్తశుద్ధి ఏమిటో బహిరంగం అయ్యేలా, ప్రభుత్వానికి అవసరం అయినప్పుడు మాత్రమే ఈ కేసు మీడియాలలో ప్రముఖంగా వినిపించేది. అయితే ఒక్క రవితేజ మినహా ఇందులో టాప్ సెలబ్రిటీలు లేకపోవడంతో ఆ సెగ అందరికి తగల్లేదు.
ఇక ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం మారడంతో, ఇక టాలీవుడ్ కు ఎలాంటి లోటు ఉండదు అనుకున్న తరుణంలో నాగార్జున ‘ఎన్ – కన్వెన్షన్’ను కూల్చివేయడంతో ప్రారంభమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధోరణి తాజాగా జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ తో పతాక స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో మరొకసారి చంద్రబాబు ప్రస్తావన స్పృశించుకోవాల్సి వస్తోంది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సినీ ప్రముఖులను ఆహ్వానించి రాచమర్యాదలు చేయడమే కాక, ఏపీలో షూటింగ్స్ చేయాల్సిందిగా కోరారు. అలాగే కొత్త స్టూడియోల నిర్మాణాలకు సినీ ప్రముఖులను ఏపీకి ఆహ్వానించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన పిదప మళ్ళీ టాలీవుడ్ కు పెద్దపీట వేసి సినీ ఇండస్ట్రీకి తగినంత గౌరవాన్ని ఇస్తున్నారు.
జగన్, రేవంత్ రెడ్డిల ప్రభుత్వంతో తలలు పట్టుకున్న టాలీవుడ్ కు చంద్రబాబు ఓ ‘మహానుభావుడు’లా కనిపిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. బహుశా ఈ పరిణామాల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు చంద్రబాబు విలువ మరింతగా తెలిసి వస్తుందని చెప్పొచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…