ఒకరు విజనరీ… మరొకరు ప్రిజనరీ

ఒకరు విజనరీ అయితే మరొకరు ప్రిజనరీ… వారే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.

ముందుగా ప్రిజనరీ ఎందుకో చెప్పుకోవడం చాలా అవసరం.

ADVERTISEMENT

జగన్‌ మెప్పు కోసం తమ పరిధి, నియమ నిబందనలు ఉల్లంఘించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్‌ హయాంలోనే హైకోర్టు చేత పలుమార్లు మొట్టికాయలు వేయించుకున్నారు.

ప్రభుత్వం మారిన తర్వాత కొందరికి ఇంతవరకు పోస్టులే లభించలేదు. మరికొందరు కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే జగన్‌ అండదండలు చూసుకొని రెచ్చిపోయి దాడులు చేసినవారు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపి నేతలు పలువురు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు.

అంటే జగన్‌ సహవాసం జైలుకి తీసుకువెళుతుందని స్పష్టమవుతోంది. బహుశః రాబోయే రోజుల్లో ఆయన కూడా మళ్ళీ జైలు బాట పట్టినా ఆశ్చర్యం లేదు. కనుక జగన్‌ని ప్రిజనరీ అని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తుంటారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మంచి విజనరీ నాయకుడుగానే గుర్తింపు ఉంది. ఉంటుంది.

సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ఐ‌టి రంగందే భవిష్యత్‌ అని పసిగట్టి హైదరాబాద్‌లో సైబరాబాద్ ఏర్పాటు చేసి అనేక ఐ‌టి కంపెనీలు రప్పించారు. ఆయన దూరదృష్టితో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సంపద, పేరుప్రతిష్టలు ఆర్జించిపెడుతున్నాయి.

మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటినప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, డ్రోన్‌ టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్ ఉందని నమ్మి వాటిని ప్రోత్సహిస్తున్నారు. నేడు మంగళగిరిలో డ్రోన్‌ సమ్మిట్‌లో కూడా సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం వింటే వాటిపై ఆయనకు ఎంత చక్కటి అవగాహన, ఆసక్తి ఉన్నాయో స్పష్టమవుతుంది.

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన గురించి కూడా మాట్లాడలేకపోయేవారు.

ప్రతీ సభ, సమావేశంలోనూ “బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేశా. ప్రతీ ఇంటికీ మేలు చేశా” అంటూ డబ్బా కొట్టుకోవడం లేదా చంద్రబాబు నాయుడుని విమర్శించడం, పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుండేవారు.

కనుక యువకుడిని, విదేశాలలో చదువుకొచ్చిన ఉన్నఠ విద్యావంతుడిని అని గొప్పలు చెప్పుకునే జగన్‌కి, ఏడు పదుల వయసులో ఇంత చురుకుగా, ఇంత దూరదృష్టితో వ్యవహరిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుకి ఎక్కడా పొలికే లేదు… ఇది చాలా స్పష్టంగా కనబడుతోంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Janani Makes Black And White Look Hot!

Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…

22 minutes ago

Indian 3: Shankar-Kamal’s Best Sequences Yet to Come?

Ever since Lyca Productions dropped the official announcement on Indian 3, suggesting that the pending…

43 minutes ago