
అమరావతి అంటే ఓ ప్రాంతానికో, కులానికో సంబందించిన రాజకీయ వ్యవహారం కానే కాదు. ఐదూ కోట్లమంది ఆంద్రులు మహా సంకల్పం. వారి ఆకాంక్షలకు ప్రతిరూపమే అమరావతి. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకొనేలా నిర్మిద్దామని మేము పనులు మొదలుపెట్టాము.
అప్పుడు అమరావతికి పూర్తి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ అమరావతిని భ్రష్టు పట్టించేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆంద్రుల కలల రాజధాని అమరావతే. ఓ గొప్ప సంకల్పం, సత్యం, న్యాయం, ధర్మం, త్యాగాలతో మేము ప్రారంభించిన అమరావతిని ఎవరూ అడ్డుకోలేరు. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే అమరావతికి ప్రాణం పోసి ఆంద్రులు గర్వించేలా నిర్మించి చూపుతాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతే గెలుస్తుంది. ఇదే ఫైనల్,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఒక ఇల్లు లేదా రాజ్యాన్ని కూల్చివేయడం చాలా సులువు కానీ నిర్మించడం చాలా కష్టం. అందుకే వైసీపీ ప్రభుత్వం రెండో ఆప్షన్ ఎంచుకొని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చివేతలతోనే మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేసింది. అమరావతిపై కులం ముద్ర వేసి, దానికి రాజకీయ రంగు పులిమి పక్కనపెట్టేసింది. కానీ పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోతోంది?కనీసం తాము ఎంతో గొప్పగా వర్ణించుకొంటున్న మూడు రాజధానులనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? వాటిని ఏర్పాటు చేయాల్సిన వైసీపీ ప్రభుత్వమే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం దేనికి?పైగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని రైతులను వేధించడం దేనికి? పోనీ.. ఇన్ని చేసినా అమరావతి రాజధాని కాకుండా వైసీపీ అడ్డుకోగలుగుతుందా? అంటే అనుమానమే.
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…