
Chandrababu Naidu's Andhra Pradesh Development
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఇరుగు పొరుగు రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి మాజీ సీఎం జగన్ తప్ప. ఒకవేళ ఏదైనా అభివృద్ధి జరిగితే నాడు తాను శంకుస్థాపన చేసినందునే జరిగిందని, ఆ క్రెడిట్ సీఎం చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తుంటారు.
బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌పై రాజకీయంగా పైచేయి సాధించాలని ఆరాటపడుతోందని అర్ధమవుతూనే ఉంది. ఈ ప్రయత్నంలో కేటీఆర్, హరీష్ రావులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిత్యం విమర్శిస్తూనే ఉన్నారు.
అయితే ఈ క్రమంలో వారి నోటితోనే చంద్రబాబు నాయుడు ఏపీలో ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు? ఏయే జిల్లాలకు ఎన్ని నీళ్ళు తరలిస్తున్నారు?ఏవిధంగా తరలిస్తున్నారు?వాటి కోసం ఎన్ని వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు? ఆ పనుల పురోగతి గురించి వారి నోటితో వారే చెపుతున్నారు.
అంటే ఏపీ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేస్తూ శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని బీఆర్ఎస్ పార్టీ దృవీకరిస్తోందన్న మాట! కానీ దాంతో మంచి అనుబంధం ఉన్న జగన్ మాత్రం ఒప్పుకోవడం లేదు! కనీసం ఆయా ప్రాజెక్టుల క్రెడిట్ తీసుకున్నందుకైనా వారి విమర్శలను ఖండించాలి కదా? కానీ మౌనం వహిస్తున్నారు.
ఈవిధంగా ఓ పక్క తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలు ‘చంద్రబాబు నాయుడు మా నీళ్ళు ఎత్తుకుపోతున్నరంటూ’ విమర్శిస్తుంటే, మరోపక్క తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులను, కర్ణాటకకు దక్కాల్సిన ఐటి కంపెనీలు, ఉద్యోగాలను సీఎం చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోతున్నారంటూ ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కానీ వాటి ఈ ఆరోపణలే ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం… కాదా?
వీటిపై మంత్రి నారా లోకేష్ చిలిపిగా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుసరిస్తున్న అత్యంత రహస్య విధానం లీక్ అయ్యింది. పెట్టుబడిదారులకు వెంటనే అదే రోజున జవాబు ఇవ్వడమే ఆ విధానం. దీనిని నిరభ్యంతరంగా ఎవరైనా కాపీ కొట్టుకోవచ్చు,” అని ‘ఎక్స్’లో మెసేజ్ పెట్టి, దాని కింద #స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు అనేక విధానాలు ఉంటాయి. వాటిలో కొత్తగా ఇది కూడా చేర్చవచ్చు.
చివరిగా ఒక మాట! వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వీటన్నిటి క్రెడిట్ తీసుకుంటున్నారంటే అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అంగీకరిస్తున్నట్లే కదా?మరెందుకు అన్ని రంగాల్లో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందని విమర్శిస్తున్నారు?
🚨🚨Breaking: Andhra Pradesh’s top-secret investment strategy has been leaked. It’s called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
— Lokesh Nara (@naralokesh) November 20, 2026
Salman Khan's Maatrubhumi: May War Rest in Peace is facing criticism over its promotional content.…
One of Tollywood's successful combinations, Mahesh Babu and Anil Ravipudi, is back in the news.…