
Chandrababu Naidu at Visakhapatnam CII Summit
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. దీని ద్వారా సుమారు రూ.11 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రూ.9.89 లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో 303 ఒప్పందాలు కుదిరాయి. వీటన్నిటి ద్వారా సుమారు 3.48 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కనుక ఈ సదస్సు విజయవంతం అయినట్లే.
అయితే ఈ సదస్సులో మీడియా ప్రతినిధులు సిఎం చంద్రబాబు నాయుడుని అడిగిన ఓ ప్రశ్న, దానికి ఆయన చెప్పిన సమాధానం ఆలోచింపజేస్తుంది.
ఏపీలో ప్రభుత్వం మారితే రాజకీయ వైఖరి చాలా భిన్నంగా ఉంటోంది. కనుక ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడితే వాటికి భద్రత ఉంటుందని గ్యారెంటీ ఏమిటి? అని ‘ది హిందూ’ పత్రిక ప్రతినిధి ప్రశ్నించారు.
ఇలాంటి వేదికపై ఇలాంటి రాజకీయ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా ఇబ్బందికరమే. కానీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రశాంతంగా “ఈసారి అటువంటి రాదు. ప్రజలు కోరుకుంటున్నట్లే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. కనుక ప్రజలు అభివృద్ధికే ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఈ పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పించేందుకు పార్లమెంటులో ‘పెట్టుబడుల భద్రత చట్టం’ చేయిస్తున్నాము . అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం,” అని చెప్పారు.
ఈ సదస్సులోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదన చేయగా దానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు కూడా.
రాజధాని అమరావతిని మార్చకుండా పార్లమెంటులో ఏవిధంగా చట్ట సవరణ చేయించి రక్షణ కల్పించారో, అదేవిధంగా ఇప్పుడు పెట్టుబడుల భద్రత చట్టం తీసుకు రాబోతున్నారన్న మాట!
అయితే మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలోనే “ఒకవేళ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఏమిటి?” అనే ప్రశ్న కూడా ఇమిడి ఉందని అర్ధమవుతూనే ఉంది.
కానీ రాజకీయాలు మాట్లాడేందుకు ఇది తగిన వేదిక కాదు. కనుక రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా రాజకీయంగా ఏవిధంగా అడ్డుకోబోతున్నామనే విషయం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పలేదు. అయితే అది ఏవిధంగా అనేది రాష్ట్ర ప్రజలకు, వైసీపీకి బాగా తెలుసు. కనుక ఇతరులకు తెలియకపోయినా మరేం పర్వాలేదు.
Tollywood has money, stars, technicians and access to the biggest markets in the country. Yet,…
Mammootty and his son Dulquer Salmaan are heading for an unusual box-office clash on November…