Telugu

ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ జైల్లోనే?

మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒక్క విషయం స్పష్టమైంది. వరుస కేసులతో ఆయనతో సహా టిడిపి ముఖ్య నేతలందరినీ అరెస్టు చేసి, ఎన్నికల వరకు అందరినీ జైలులోనే ఉంచితే అవలీలగా విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

గత రెండేళ్ళుగా వారిపై అనేక అవినీతి కేసులపై దర్యాప్తు చేయిస్తూ ఇంతవరకు కాలక్షేపం చేసి, ఇప్పుడు అన్ని కేసులను ఒకేసారి కాకుండా, ఒక కేసు విచారణ ముగింపుకు వస్తున్నప్పుడు కొత్తగా మరొకటి నమోదు చేస్తుండటం గమనిస్తే వీలైనంత ఎక్కువ కాలం లేదా కనీసం ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరినీ జైల్లోనే ఉంచాలని భావిస్తున్నట్లుంది.

ADVERTISEMENT

హైకోర్టు, ఏసీబీ కోర్టు విచారణకు ఏపీ సీఐడీ తరపున హాజరవుతున్న న్యాయవాదులు కూడా తమకు కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరుతుండటం గమనిస్తే, వైసీపి ప్రభుత్వం ఈ కేసులను ఎన్నికల వరకు సాగదీయాలనుకొంటోందని స్పష్టమవుతోంది.

జగన్, విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులను ఏవిదంగా ఏళ్ళ తరబడి సాగదీస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అదేవిదంగా ఈ కేసులను కూడా కనీసం ఎన్నికలు పూర్తయ్యే వరకు సాగదీయాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టులు, కేసులు, విచారణలు అంటే ఎలాగూ త్వరగా తెమిలేవీ కావనే విషయం వైసీపి కంటే ఎవరికి బాగా తెలుసు?కనుక ఇప్పుడు ఈ సమస్యల నుంచి ఏవిదంగా బయటపడాలని ఆలోచించుకోవలసింది టిడిపి నేతలే.

అయితే వైసీపి తన రాజకీయ కక్ష సాధింపులకు కేసుల ముసుగు వేసి సమర్ధించుకొంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు వైసీపిని సమర్ధిస్తారా లేదా?అనేదే ముఖ్యం. అప్పటికి చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి నేతలందరినీ జైల్లో పెట్టినా కూడా ప్రజలే తేలుస్తారు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Obsession Uncut Version on JioHotstar: Release Date OUT

The original uncut version of Obsession is scheduled to premiere on JioHotstar on October 30.…

26 minutes ago

Ranabaali Review: History Without Heart

BOTTOM LINE History Without Heart RATING 2/5 Story, Screenplay, Director: Rahul Sankrityan Cast: Vijay Deverakonda,…

48 minutes ago