
చంద్రబాబుకి కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇష్యూ చేసింది ఏపీ హైకోర్టు. అయితే బెయిలు ఓకే కానీ షరతులు నాట్ ఓకే అంటూ షరతుల పరిమితిని ఇంకాస్త పెంచాలంటూ సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించారు.సిఐడి వేసిన పిల్ ను స్వీకరించిన హైకోర్టు విచారణకు అనుమతినిచ్చింది.
కోర్ట్ 5 సాధారణ షరతులతో కూడిన బెయిలు మంజూరుచేసిన విషయం తెలిసిందే. అవి..,
1.లక్ష రూపాయిల పూచి కత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలి.
2 .సొంత ఖర్చుతోనే వైద్యం చేయించుకోవాలి.
3 .వైద్యం అందిస్తున్న ఆసుపత్రి వివరాలు జైలుకు సమర్పించాలి.
4 .కేసును ప్రత్యేక్షంగాను, పరోక్షంగానూ ప్రభావితం చేసే విధంగా ఎక్కడ మాట్లాడకూడదు.
5 .నవంబర్ 28 సాయంత్రం ఐదు లోపు సరెండర్ కావాలి.
న్యాయస్థానాలు ఇచ్చిన ఈ షరతులు కాకుండా చంద్రబాబుకి మరికొన్ని షరతులు విదించాలనంటూ “బెయిలు ఓకే.. బట్ మోర్ కండిషన్స్ ప్లీజ్.!”అంటూ కోర్టును కోరిన సిఐడి అధికారులకు, అది బాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టే అంటూ బాబు తరుపు న్యాయవాదులు కౌంటర్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని శుక్రవారానికి వాయిదా వేసింది.
చంద్రబాబుకి వచ్చిన అనూహ్య ప్రజా స్పందన చూసిన అధికార పార్టీ బాబుపై కుట్రతోనే ఇటువంటి కేసులు వేస్తూ విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తుందని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పది సంవత్సరాల నుండి బెయిలు మీద తిరిగే వ్యక్తులను సమర్థిస్తున్న నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విడ్డురంగా ఉందన్నారు.
జైలు నుండి బాబుని బయటకు రానివ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్ ప్రభుత్వం చివరకు బాబు బెయిలును ఆపలేక ఇప్పుడు షరతులు అంటూ మరో కొత్త నినాదంతో మరోసారి కోర్ట్ మెట్లక్కడం ఆ పార్టీ రాజకీయ వేధింపులకు నిదర్శనం అంటున్నారు టీడీపీ నేతలు.
Ranabaali First Half: It takes time to get used to VD in this role, and…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…