
గత నెలలో చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలో స్థానిక టిడిపి నేతలు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు వైసీపీ గూండాలు చేసిన దౌర్జన్యాలు అందరూ టీవీలలో చూసే ఉన్నారు. కానీ ఆ ఘర్షణలలో పోలీసులు వారిని అరెస్ట్ చేయకుండా టిడిపి నేతలు, కార్యకర్తలని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మరో ఏడుగురు ప్రస్తుతం చిత్తూరు జైలులో ఉన్నారు. వారి తరపున టిడిపి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఈరోజు వారందరూ జైల్లో నుంచి విడుదలవుతారు.
కనుక చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించేందుకు నేడు చిత్తూరుకి బయలుదేరారు. ఒకవేళ వారికి బెయిల్ మంజూరు కాకపోతే జైల్లోనే వారిని కలిసి పరామర్శించి ధైర్యం చెపుతారు. కానీ ఎప్పటిలాగే పోలీసులు చంద్రబాబు నాయుడు పర్యటనపై ఆంక్షలు విధించారు. ఆయన వెంట పరిమిత సంఖ్యలో ముఖ్య నేతలు మాత్రమే వెళ్లాలని, ఓపెన్ టాప్ వాహనాలలో ప్రయాణించరాదని, మైకులు ఉపయోగించరాదని, ర్యాలీలు చేయరాదని ఆంక్షలు విధించారు.
అయితే కొద్ది సేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొన్న చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికేందుకు భారీగా టిడిపి శ్రేణులు తరలివచ్చాయి. వారందరూ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెంటసాగారు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయని పోలీసులకు కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటనపై ఆంక్షలు విధించారు. ఈవిదంగా చేయడం వలన రేపు ప్రభుత్వం మారితే దానికి వారే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తెలిసి ఉన్నా వైసీపీ ప్రభుత్వం నేతల కనుసన్నలలో పనిచేయవలసి వస్తుండటంతో వారి కోసం గీత దాటాక తప్పడం లేదు.
Exclusive Video Interviews: Watch & Subscribe
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…